Home » AP High Court
క్యాంప్ ఆఫీసుల ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నానికి తరలించడంపై ఏపీ హైకోర్టు ( AP High Court ) లో రిట్ పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతులు గద్దె తిరుపతిరావు, మాధల శ్రీనివాసరావు, వలపర్ల మనోహర్ హైకోర్టును ఆశ్రయించారు.
రేపు (మంగళవారం) ఏపీ హైకోర్టులో ఎస్సై నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నది. ఎస్సై నియామకంలో అన్యాయం జరిగిందంటూ అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గతంలోఎత్తు అంశంలో అర్హత కలిగిన అభ్యర్థులను తాజా రిక్రూట్మెంట్లో రిక్రూట్ మెంట్ అధికారులు అనర్హులుగా పరిగణించారు.
Andhrapradesh: రాష్ట్రంలో ఇసుక అక్రమాలు, కాంట్రాక్ట్ ముగిసిన తవ్వకాలపై హైకోర్ట్‌లో పిల్ దాఖలైంది. వేల కోట్లు రూపాయలు దుర్వినియోగంపై ఆధారాలుతో సహా పిటిషనర్ పిల్లో చేర్చారు. దండ నాగేంద్ర అనే వ్యక్తి తరపున హైకోర్ట్ న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ పిటీషన్ వేశారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు మధ్యాహ్నం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.
Andhrapradesh: ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణను హైకోర్టు డిసెంబర్ 6కు వాయిదా వేసింది. ఈరోజు (గురువారం) ఏపీ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసులో సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించాల్సి ఉంది.
Andhrapradesh: టీడీపీ నేత మహసేన రాజేష్‌కు ఏపీ హైకోర్ట్‌లో భారీ ఊరట లభించింది. ఓ ఛానల్ యాంకర్, కంపెనీ సెక్రటరీ పెట్టిన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం రాజేష్ హైకోర్ట్‌ను ఆశ్రయించగా.. ఈరోజు(గురువారం) విచారణకు వచ్చింది.
రుషికొండ ( Rushikonda ) విధ్వంసంపై ఏపీ హైకోర్టు ( AP High Court ) లో జనసేన ( Janasena ) కార్పొరేటర్, మూర్తి యాదవ్ పిటీషన్ వేశారు. విశాఖపట్నంలో రుషికొండ ఒక పర్యాటక ప్రాంతమని దానిని విధ్వంసం చేస్తున్నారని పిటీషన్లో తెలిపారు.
Andhrapradesh: రిషికొండపై అక్రమ తవ్వకాలు, భవన నిర్మాణాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.
Andhrapradesh: ఆంధ్ర యూనివర్సిటీలో నిధుల మళ్లింపుతో పాటు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని వీసీ ప్రసాద్ రెడ్డి తదితరులపై విచారణ జరిపించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది.
Andhrapradesh: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టు విచారణ జరిగింది. చంద్రబాబు తరపున ఇప్పటికే సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు.