AP HighCourt: ఇసుక కేసులో చంద్రబాబు బెయిల్‌పై విచారణ డిసెంబర్ 6కు వాయిదా
ABN , First Publish Date - 2023-11-30T15:37:32+05:30 IST
Andhrapradesh: ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణను హైకోర్టు డిసెంబర్ 6కు వాయిదా వేసింది. ఈరోజు (గురువారం) ఏపీ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసులో సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించాల్సి ఉంది.
అమరావతి: ఇసుక కేసులో (Sand Case) టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణను హైకోర్టు డిసెంబర్ 6కు వాయిదా వేసింది. ఈరోజు (గురువారం) ఏపీ హైకోర్టులో (AP HighCourt) చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసులో సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే ఈరోజు విచారణకు వచ్చిన సమయంలో తమకు మరింత గడువు కావాలని కోర్టును సీఐడీ న్యాయవాది కోరారు. దీనిపై చంద్రబాబు తరపున న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము వాదనలు పూర్తి చేశామని, సీఐడీ తరపు న్యాయవాదులు కావాలనే ఆలస్యం చేస్తున్నారని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న హైకోర్టు సీఐడీ తరపున న్యాయవాదుల వాదనల కోసం డిసెంబర్ 6కు విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.