AP High Court: ప్రభుత్వ కార్యాలయాలను వైజాగ్‌కు తరలించడంపై ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్
ABN , First Publish Date - 2023-12-04T22:19:48+05:30 IST
క్యాంప్ ఆఫీసుల ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నానికి తరలించడంపై ఏపీ హైకోర్టు ( AP High Court ) లో రిట్ పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతులు గద్దె తిరుపతిరావు, మాధల శ్రీనివాసరావు, వలపర్ల మనోహర్ హైకోర్టును ఆశ్రయించారు.
అమరావతి: క్యాంప్ ఆఫీసుల ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నానికి తరలించడంపై ఏపీ హైకోర్టు ( AP High Court ) లో రిట్ పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతులు గద్దె తిరుపతిరావు, మాధల శ్రీనివాసరావు, వలపర్ల మనోహర్ హైకోర్టును ఆశ్రయించారు. రైతుల తరపున న్యాయవాది ఉన్నం శ్రవణ్‌కుమార్ పిటిషన్ వేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో సీఎం క్యాంప్, ఇతర మంత్రులు, అధికారులు క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులో కార్యాలయాల మార్పు కుదరదని చెప్పిన అంశాన్ని రైతులు గుర్తుచేశారు. పైగా హైకోర్టు తీర్పులో రిట్ ఆఫ్ మాండమస్ విధించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్ట్ తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా.. స్టే ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించిందని రైతులు పేర్కొన్నారు. రాజధాని తరలించడం సాధ్యం కాక.. క్యాంప్ ఆఫీసుల ముసుగులో తరలించే ప్రయత్నం చేస్తున్నారని రైతుల ఆరోపించారు.