Home » AP High Court
పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు అంశంలో వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమోలను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సీల్ వేయకపోయినా చెల్లుబాటు అవుతుందని ఇప్పటికే ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. డిక్లరేషన్‌పై గెజ్జిటెడ్ అధికారి సంతకం ఉండి సీల్ లేకపోయినా చెల్లుబాటు అవుతుందని చెప్పడంతో వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టుకు వెళ్లారు. ఈ మెమోలు కొట్టివేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంగారెడ్డిలో పరారై పల్నాడు జిల్లా నరసారావుపేటలో ప్రత్యక్షమయ్యారు..
Bail to Pinnelli Ramakrishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు(AP High Court) కీలక తీర్పునిచ్చింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్(Anticipatory bail) మంజూరు చేసింది హైకోర్టు. అయితే, పలు షరతులు విధించింది. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ..
వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. ఈవీఎంల ధ్వంసం కేసులో జూన్6 వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినప్పటికీ ఎమ్మెల్యే పిన్నెల్లి మాత్రం ఇంకా బయటకురాలేదు. ఓవైపు రామకృష్ణారెడ్డి తప్పించుకుతిరుగుతుంటే.. మరోవైపు ఆయన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.
మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి(Pinnelli Ramakrishna Reddy) ఏపీ హైకోర్టులో(AP High Court) భారీ షాక్ తగిలింది. ఆయన కదలికలపై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. పిన్నెల్లి మాచర్లకు వెళ్ల కూడదని ఆదేశాలు జారీ చేసింది.
పోలింగ్ రోజు జరిగిన దాడులు, అనంతర పరిణామాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం చేయడం వైసీపీ అరాచకానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కౌంటింగ్ వరకూ పిన్నెల్లిని అరెస్టు చేయొద్దు అంటే అర్థం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. ఇంత దరిద్రపుగొట్టు ఎలక్షన్స్ దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని అసహనం వ్యక్తం చేశారు.
ఈవీఎంని ధ్వంసం చేసి పరారీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 6న ఉదయం 10 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పల్నాడు జిల్లాల్లో ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ జరిగిన రోజు, ఆ తర్వాత అల్లర్లు, అరాచకాలు జరుగుతున్నాయి. అయితే ఈ అల్లర్లలో పెద్దఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడ్డారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది..
Andhrapradesh: సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. సంక్షేమ పథకాలకు నిధులు నిలిపివేతపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు దాఖలు చేసింది. ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరుగగా.. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం తరపున వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.