Share News

KA Paul: అందుకే ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశా...

ABN , Publish Date - May 24 , 2024 | 03:39 PM

పోలింగ్ రోజు జరిగిన దాడులు, అనంతర పరిణామాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం చేయడం వైసీపీ అరాచకానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కౌంటింగ్ వరకూ పిన్నెల్లిని అరెస్టు చేయొద్దు అంటే అర్థం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. ఇంత దరిద్రపుగొట్టు ఎలక్షన్స్ దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని అసహనం వ్యక్తం చేశారు.

KA Paul: అందుకే ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశా...

విశాఖ మే 24: పోలింగ్ రోజు జరిగిన దాడులు, అనంతర పరిణామాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం చేయడం వైసీపీ అరాచకానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కౌంటింగ్ వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దంటే అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇంత దరిద్రపుగొట్టు ఎలక్షన్స్ దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని అసహనం వ్యక్తం చేశారు.


కేఏ పాల్ సూటి ప్రశ్నలు

చట్టం తన పని తాను చేసుకుపోతే క్రిమినల్స్ బయట ఎందుకు ఉన్నారని కేఏ పాల్ ప్రశ్నించారు. స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఈవీఎంలకు భద్రత లేదని.. స్ట్రాంగ్ రూమ్‌ల ముందు మాత్రమే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు కానీ వెనక ఎందుకు పెట్టలేదో చెప్పాలని ప్రశ్నించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద లైవ్ వెబ్ లింక్స్ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని, గతంలో ఇచ్చిన విషయాన్ని కేఏ పాల్ గుర్తు చేశారు. అందుకే నిన్న దీనిపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. తనను ఎదుర్కొలేకే అమెరికా వెళ్లి పోవాలంటూ కొందరు హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. "నా దేశం, నా తెలుగు రాష్ట్రాలు, నా విశాఖ కోసం ఇక్కడే ఉండిపోయాను" అని కేఏ పాల్ తెలిపారు.

For More AP News and Telugu News..

Updated Date - May 24 , 2024 | 03:48 PM