Share News

AP Elections 2024: ఆ ప్రాంతాల్లో రీపోలింగ్‌కు అంబటి రాంబాబు డిమాండ్.. ఏపీ హైకోర్టు ఏం చెప్పిందంటే..?

ABN , Publish Date - May 23 , 2024 | 04:13 PM

పల్నాడు జిల్లాల్లో ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ జరిగిన రోజు, ఆ తర్వాత అల్లర్లు, అరాచకాలు జరుగుతున్నాయి. అయితే ఈ అల్లర్లలో పెద్దఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడ్డారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు.

AP Elections 2024: ఆ ప్రాంతాల్లో రీపోలింగ్‌కు అంబటి రాంబాబు డిమాండ్.. ఏపీ హైకోర్టు ఏం చెప్పిందంటే..?

అమరావతి: పల్నాడు జిల్లాల్లో ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ జరిగిన రోజు, ఆ తర్వాత అల్లర్లు, అరాచకాలు జరిగాయి. అయితే ఈ అల్లర్లలో పెద్దఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడ్డారని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపిస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 236, 237, 253, 254 వార్డుల్లో రీపోలింగ్ కోరుతూ మంత్రి అంబటి రాంబాబు ఏపీ హై కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.


తన నియోజకవర్గంలో రీ పోలింగ్ నిర్వహించాలని అంబటి వేసిన పిటీషన్‌పై హైకోర్టులో ఈరోజు(గురువారం) హైకోర్టు విచారణ చేసింది. మొత్తం నాలుగు పోలింగ్ బూత్‌లలో రీ పోలింగ్ జరపాలని అంబటి కోర్టులో పిటిషన్ వేశారు. అంబటి పిటిషన్‍పై హైకోర్టులో కాసేపటి క్రితమే విచారణ ముగిసింది. అయితే అంబటి వేసిన పిటీషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.


మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్‌లో ఈవీఎంను ధ్వంసం చేశారు. పిన్నెల్లిని అరెస్ట్ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో పాటు మాచర్లలోని పలు పోలింగ్ బూతులల్లో పిన్నెల్లి బ్రదర్స్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. మాచర్లలో రీపోలింగ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇక్కడ రీపొలింగ్‌పై పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలికా.

కాగా.. సత్తెనపల్లి, మరికొన్ని ప్రాంతాల్లో పెద్దఎత్తున అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయా ప్రాంతాల్లో అంబటి రాంబాబుతో పాటు మరికొంత మంది వైసీపీ నేతలు కూడా రీపోలింగ్ నిర్వహించాలని పెద్దఎత్తున డిమాండ్లను తెరమీదకు తీసుకొస్తున్నారు. అయితే టీడీపీ నేతలు కూడా కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతలే రిగ్గింగుకు పాల్పడి ఆ నెపాన్ని తమపై రుద్దుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం రీపోలింగ్ నిర్వహిస్తామని ఏ సందర్భంలోనూ చెప్పలేదు. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా ఫిర్యాదు చేశారు. రాజకీయ నేతల ఫిర్యాదులపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ నేత డీజే శివపై వైసీపీ మూకల దాడి..

నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్..

టార్గెట్ ఎమ్మెల్సీ.. ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ..

ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు..

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 23 , 2024 | 04:49 PM