Home » AP Secretariat
గత ఐదేళ్లు వైసీపీ నేతలు రాష్ట్రంలో అరాయకం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారిన కూడా కొంతమంది వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రుగులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇప్పటికే కొందరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించగా..
గ్రామ, వార్డు సచివాలయాల, మీ సేవా కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాల జారీకి మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి లోగోలు, సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేపు(బుధవారం) సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈరోజు సెక్రటేరియట్‌కు వెళ్లిన పవన్ తన చాంబర్‌ను చూడటం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పరిచయం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu).. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి సచివాలయం వేదిక అయ్యింది..
తనకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వారి సమస్యల వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
వలంటీర్ వ్యవస్థపై మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పెన్షన్ అందిస్తామని అన్నారు. వలంటీర్లతో రాజీనామా చేయించి జగన్ రోడ్డున పడేశారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లోని సచివాలయంలో ఈరోజు(గురువారం) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే చేశారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయం(AP Secretariat)లో జూన్ 13న ముఖ్యమంత్రిగా చంద్రబాబు (CM chadrababu) బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం కుటుంబసమేతంగా ఆయన తిరుమల చేరుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం ఆయన సచివాలయానికి రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయం(AP Sachivalayam)లో ఐటీ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ-ఆఫీస్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber crime police) స్వాధీనం చేసుకున్నారు. తాళం వేసి లాగిన్ ఐడీలు క్లోజ్ చేశారు.