Fire Accident: సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం..
ABN , Publish Date - Apr 04 , 2025 | 07:31 AM
Fire Accident: ఏపీ సచివాలయంలో బారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఉద్యోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.

అమరావతి: ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో శుక్రవారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక అంచనా వేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వెంటనే సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుని మంటలను ఫైర్ సేఫ్టీ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదవశాత్తూ ఈ సంఘటన జరిగిందా కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
సచివాలయంలోని రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి. తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరూ కార్యాలయం లోపల లేరని సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
AP High Court: కాకాణి నేరానికి ఆధారాలున్నాయి
AP Health Achievements: ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ భేష్
Lars Labs Investment: రాష్ట్రంలో లారస్ ల్యాబ్స్ 5 వేల కోట్ల పెట్టుబడులు
Tirumala: అలిపిరి నిఘాపై ఫోకస్
Read Latest AP News And Telugu News