AP News: ఎన్టీఆర్ జిల్లాలో పింఛన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి పరారీ
ABN , Publish Date - Apr 01 , 2025 | 08:02 PM
Pension Money: పింఛన్ సొమ్ముతో ఓ ఉద్యోగి ఉడాయించాడు. ఈ సంఘటన ఏపీలోని ఏన్టీఆర్ జిల్లాలో జరిగింది. ఫించన్‌తో పారిపోయిన ఉద్యోగిపై ఉన్నత స్థాయి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు ఉద్యోగి కోసం వెతుకుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్లలో పెన్షన్ సొమ్ముతో వెల్ఫేర్ అసిస్టెంట్ పరారయ్యాడు. కంచికచర్ల సచివాలయం -3లో వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్ ఇవాళ(మంగళవారం) పెన్షన్ పంపిణీ చేయాల్సి ఉంది. పింఛన్ సొమ్ము పంపిణీ చేయడానికి సదరు ఉద్యోగి రాలేదు. అయితే ఆయన పరారైనట్లు ఉన్నత స్థాయి అధికారులు గుర్తించారు. రూ.7లక్షల 50 వేలతో వెల్ఫేర్ అసిస్టెంట్ పరారయ్యాడని అధికారులు తెలిపారు. తోట తరుణ్ వెల్ఫేర్ అసిస్టెంట్‌గా జూలై నెల నుంచి పనిచేస్తున్నాడు. ఈరోజు నుంచి పెన్షన్ పంపిణీ చేయాల్సి ఉండగా ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది.
తోట తరుణ్ కుమార్ స్వగ్రామం వెళ్లి అధికారులు వివరాలు తెలుసుకుంటే అతను కంచికచర్లకు వచ్చినట్లుగా బంధువులు తెలిపారు. గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో గతంలో పెన్షన్ సొమ్ముతో అతను పరారై సస్పెండ్ అయినట్లుగా సమాచారం. పెన్షన్ దారులకు ఇబ్బందులు కలగకుండా మరో పద్ధతిలో డబ్బును సమకూర్చి పెన్షన్ దారులకు సంబంధిత అధికారులు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సంఘటనలో కంచికచర్ల పోలీస్ స్టేషన్‌లో వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్‌పై ఎంపీడీవో ఫిర్యాదు చేశారు. ఎంపీడీవో ఫిర్యాదు మేరకు తోట తరుణ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News