MLA Aroori Ramesh: టెన్త్ పేపర్ల లీకేజీలో బీజేపీ నాయకుల హస్తం...

ABN , First Publish Date - 2023-04-05T11:06:33+05:30 IST

వరంగల్: బీఆర్ఎస్‌ (BRS)కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై బీజేపీ (BJP) బురదజల్లుతోందని వర్థన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (MLA Aroori Ramesh) అన్నారు.

MLA Aroori Ramesh: టెన్త్ పేపర్ల లీకేజీలో బీజేపీ నాయకుల హస్తం...

వరంగల్: బీఆర్ఎస్‌ (BRS)కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై బీజేపీ (BJP) బురదజల్లుతోందని వర్థన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (MLA Aroori Ramesh) అన్నారు. టెన్త్ పేపర్లు లీకేజీ (Tenth Papers Leakage)పై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ.. బీఆర్ఎస్‌ను బదనాం చేస్తోందన్నారు. టెన్త్ పేపర్ల లీకేజీలో బీజేపీ నాయకుల హస్తం ఉందన్నారు. నిన్న హిందీ పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రశాంత్.. బండి సంజయ్ (Bandi Sanjay) అనుచరుడని, అందుకే పేపర్ లీక్ కాగానే ముందు బండి సంజయ్‌కు పేపర్ పంపాడన్నారు. బండి సంజయ్ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని, ఎప్పుడూ లేనిదీ ఎన్నికల ముందే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. పేపర్ లీక్ కేసుపై లోతైన విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని అన్నారు. బండి సంజయ్ సర్టిఫికెట్ కూడా ఫేకేనని.. రాజకీయం కోసం మతాన్ని వాడుకున్న బీజేపీ...ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్‌ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు. కరీంనగర్‌ జ్యోతి నగర్‌లోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లారు. అయితే, ఎక్కడికి తీసుకెళ్లారు!? ఎందుకు అరెస్టు చేశారు!? అనే విషయాలపై పోలీసులు నోరు మెదపడం లేదు. జాతీయ రహదారిపై హైదరాబాద్‌ వైపు ఆయనను తీసుకెళుతున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే, పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులోనే సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తొలుత, అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత సుమారు 100 మంది పోలీసులు సంజయ్‌ ఇంటిని చుట్టుముట్టారు. ఆయన అరెస్టుకు ప్రయత్నించారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. దాంతో, బండి సంజయ్‌ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని సంజయ్‌ కోరితే, అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందంటూ పోలీసులు జవాబు ఇచ్చారని బీజేపీ వర్గాలు తెలిపాయి. చివరికి, దాదాపు ఒంటి గంట సమయంలో సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.

Updated Date - 2023-04-05T11:06:33+05:30 IST