Home » Arrest
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్(Pooja Khedkar) తల్లి మనోరమ ఖేద్కర్(Manorama Khedkar)ను పుణె పోలీసులు(pune police) రాయ్‌గఢ్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఖేద్కర్ తల్లి పిస్టల్‌తో రైతులను బెదిరించిన వీడియో ఇటివల వెలుగులోకి వచ్చింది.
కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో భారతదేశ యువకులను పంపి.. అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠాలోని కీలక నిందితుడిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) అరెస్టు చేసింది.
తండ్రీకూతుళ్ల బంధంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హన్ముంతు అరెస్ట్ అయ్యాడు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ప్రణీత్‌ను బెంగళూరులో బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
సోషల్ మీడియాలో తండ్రీకూతురు బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కీచకుడు ప్రణీత్ హనుమంతును తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. బెంగళూరు కోర్టులో ప్రణీత్‌ను హాజరు పరిచి ట్రాన్సిట్ వారింటి మీద హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.
గుంతకల్లు, జూలై 6: ఎప్పుడూ ఒక శాతం కమీషన(లంచం) తీసుకునేవారట..! కానీ ఈసారి ఇంకొక్కశాతం ఎక్కువ కావాలని అడిగారట. ఆ దురాశే వారిని ఊచలు లెక్కబెట్టేలా చేసింది. సీబీఐ వలలో చిక్కి.. పరువు బజారున పడేలా చేసింది. గుంతకల్లు రైల్వే డివిజన కేంద్రంలో తొలిసారి సీబీఐ దాడులు జరగడానికి కారణం ఇదే అంటున్నారు. డీఆర్ఎం కార్యాలయంలో ఓ శాఖాధికారిపై కాంట్రాక్టర్లు చేసిన ఫిర్యాదు అవినీతి వృక్షాలను పెకిలించింది. రైల్వే అకౌంట్స్ విభాగంలో అవినీతి బురద డీఆర్ఎం కార్యాలయానికి మాసిపోని మరకలను అంటించింది. తిరుపతిలో ఆరు నెలల కిందట జరిగిన సీబీఐ దాడులు మరువకనే.. అంతకు మించిన అవినీతిని బయట పెట్టేదాడులు గుంతకల్లులో ..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ అరెస్టుపై ఆయన భార్య సునీత కేజ్రీవాల్ కీలక విషయాలు వెల్లడించారు. ఇందుకు బంధించిన వీడియోను ఆమె శనివారంనాడు విడుదల చేశారు. ఎన్డీయే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తప్పుడు వాంగ్మూలం ఆధారంగానే లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిందని ఆ వీడియోలో ఆమె ఆరోపించారు.
మంగళగిరి(Mangalagiri) టీడీపీ కేంద్ర కార్యాలయం(TDP central office)పై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా... తాజాగా మరో ముగ్గురిని మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(MLC Lella AppiReddy) అనుచరులు జింకా సత్యం, లంకా అబ్బి నాయుడు, తియ్యగూర గోపిరెడ్డిగా గుర్తించి అరెస్టు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో జైల్లో ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనను బెదిరించి, కొట్టించి రూ.250కోట్ల విలువైన సంస్థను రాయించుకునే ప్రయత్నం చేసినట్లు బాఽధితుడు చెన్నుపాటి వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మహిళపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యవహారంలోఉత్తర చెన్నై బీజేపీ కార్యదర్శి సెంథిల్(Chennai BJP Secretary Senthil)ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కొరుక్కుపేట నేతాజీ నగర్‌కు చెందిన రామరాజన్ భార్య నవమణి కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది.
వారిద్దరూ ఓ రియల్ ఎస్టేట్(Real estate) సంస్థలో పని చేస్తున్నారు. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఆ మహిళ కొద్దిరోజులుగా మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని ఘర్షణ పడుతున్నాడు. వివాదం పరిష్కరించుకుందామని పిలిచి.. మహిళను దారుణంగా హత్య చేశాడు.