Hyderabad: 12 ఏళ్లు.. 68 చోరీలు.. తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు దోచుకుంటారు
ABN , Publish Date - May 30 , 2024 | 10:47 AM
వరుస దొంగతనాలతో నిందితుడిగా ఉన్న పాత నేరస్తుడితోపాటు అతడికి సహకరిస్తున్న మరో పాత నేరస్తుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Central Zone Task Force Police) అరెస్ట్ చేశారు.
- ఇద్దరు ఘరానా నేరగాళ్ల అరెస్ట్
హైదరాబాద్ సిటీ: వరుస దొంగతనాలతో నిందితుడిగా ఉన్న పాత నేరస్తుడితోపాటు అతడికి సహకరిస్తున్న మరో పాత నేరస్తుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Central Zone Task Force Police) అరెస్ట్ చేశారు. నాగర్‌కర్నూల్(Nagarkurnool) జిల్లా వీపనగండ్ల మండలం నాగర్తబండ తండాకు చెందిన రత్లావత్ శంకర్‌నాయక్(31) 12 ఏళ్లుగా చోరీలు చేస్తున్నాడు. హత్యాయత్నం కేసులో గద్వాల పోలీసులు ఇతడిని 2012లో అరెస్ట్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఇతడు బైక్‌పై తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించి, ప్రత్యేక పరికరంతో తాళం పగులగొట్టి, ఇంట్లో విలువైన వస్తువులు, నగదు చోరీ చేసి పరారయ్యేవాడు. బైక్‌ల దొంగతనాలు చేసేవాడు. మద్యం, గంజాయికి అలవాటుపడ్డాడు. శంకర్‌నాయక్(Shankar Naik)పై రెండు తెలుగురాష్ట్రాల్లో 68 చోరీ కేసులు నమోదయ్యాయి. పలుసార్లు పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదికూడా చదవండి: Hyderabad: 33శాతం పెరిగిన విద్యుత్ వినియోగం..
హైదరాబాద్, రాచకొండ కమిషనర్లు నాలుగుసార్లు పీడీయాక్ట్ నమోదు చేశారు. పలుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోని శంకర్‌నాయక్ కీసర, నేరేడ్‌మెట్, రాజేంద్రనగర్, మహబూబ్‌నగర్, వనపర్తి తదితర ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేశాడు. శంకర్ నాయక్ జైలులో ఉన్న సమయంలో మహబూబ్‌నగర్(Mahbubnagar) జిల్లా దేవరకద్రకు చెందిన పాత నేరస్తుడు బంద్రవల్లి రాకేష్ అలియాస్ రాకీ అలియాస్ లడ్డూ(21) పరిచయమయ్యాడు. శంకర్ నాయక్ చోరీ చేసిన సొత్తును రాకేష్‌కు ఇచ్చేవాడు. విక్రయించగా వచ్చిన డబ్బులను పంచుకునేవారు. వరుస చోరీలు జరగడంతో దర్యాప్తు ప్రారంభించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు చోరీ జరిగిన తీరును బట్టి శంకర్ నాయక్ చేసినట్లు గుర్తించారు. నిఘా పెట్టిన సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శంకర్ నాయక్, రాకేష్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 80 గ్రాముల బంగారు నగలు, 25 గ్రాముల వెండి నగలు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu Newshy