Home » Arrest
రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (‘మా’) కమిటీ క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఆమె దోషిగా తేలితే చర్యలు తప్పవని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల పేర్కొన్నారు. అందులో భాగంగా ఆయన కమిటీ సభ్యులు అభిప్రాయాలను కోరినట్లు తెలిసింది.
సంచలనం సృష్టించిన రేవ్‌పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బెంగళూరు ఎలకా్ట్రనిక్ సిటీలోని జీఆర్ ఫాంహౌ్‌సలో జరిగిన ఈ రేవ్‌పార్టీపై దాడి చేసిన రోజే పోలీసులు ఐదుగురు మాదక ద్రవ్యాల వ్యాపారులు, పార్టీ నిర్వాహకులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్ నటి హేమను బెంగళూరు పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సోమవారం నాలుగు గంటల సమయంలో హైదరాబాద్‌కు వచ్చిన బెంగళూరు సీసీబీ పోలీసులు హేమను అదుపులోనికి తీసుకోవడం జరిగింది..
అంతర్జాతీయ మానవ అవయవ అక్రమ రవాణా మాఫియాలో మాస్టర్‌మైండ్‌గా ఉన్న రాంప్రసాద్‌ను కేరళ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన బి.రాంప్రసాద్ అలియాస్ ప్రతాప్ మానవ అవయవ అక్రమ రవాణా ముఠాలో మాస్టర్‌మైండ్ అని ఎర్నాకుళం రూరల్ ఎస్పీ వైభవ్ సక్సెనా తెలిపారు.
లైంగిక వేధింపుల కేసులో సస్పెండ్ అయిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)ను బెంగళూరు(bengaluru)లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిట్ అధికారులు గురువారం అర్ధరాత్రి అరెస్ట్(arrest) చేశారు.
వరుస దొంగతనాలతో నిందితుడిగా ఉన్న పాత నేరస్తుడితోపాటు అతడికి సహకరిస్తున్న మరో పాత నేరస్తుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Central Zone Task Force Police) అరెస్ట్ చేశారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్రావు కేసులో.. ఆయన ఇంట్లో దొరికిన డైరీ కీలకంగా మారుతున్నట్లు తెలిసింది. మూడ్రోజుల కస్టడీకి నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు అనుమతించడంతో.. బుధవారం ఉదయం ఏసీపీని చంచల్‌గూడ జైలు నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
ఫోన్ ట్యాపింగ్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షాలపై సైబర్ దాడి జరిగిందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమీషనర్ల ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు జరిగాయి. ఎన్నికల రోజు, తర్వాత జరిగిన ఘర్షణలు దృష్టిలో పెట్టుకొని విస్తృత తనిఖీలు చేపట్టారు.
పొద్దున్నే బీరు తాగుతూ ఓ యువతీ యువకులు నాగోల్ పీఎస్ పరిధి లోని మత్తుగూడ దారిలో హల్చల్ చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్లే సీనియర్ సిటిజన్లతో వాగ్వాదానికి దిగడంతో..