Tirumala: తిరుమలలో నకిలీ ఐఏఎస్
ABN , Publish Date - Apr 12 , 2024 | 06:47 AM
తాను ఐఏఎస్ అధికారినంటూ శ్రీవారి దర్శనానికి లేఖ సమర్పించిన ఓ నకిలీ ఐఏఎస్‌ను(IAS) తిరుమల(Tirumala) పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన నరసింహమూర్తి బుధవారం తిరుమలకు వచ్చాడు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ జాయింట్ సెక్రటరీ హోదాతో ఉన్న గుర్తింపుకార్డును చూపి 11వ తేదీకి నాలుగు ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు...
జాయింట్ సెక్రటరీ హోదాలో దర్శనానికి లేఖ
ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న పోలీసులు
తిరుమల, ఏప్రిల్12(ఆంధ్రజ్యోతి): తాను ఐఏఎస్ అధికారినంటూ శ్రీవారి దర్శనానికి లేఖ సమర్పించిన ఓ నకిలీ ఐఏఎస్‌ను(IAS) తిరుమల(Tirumala) పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన నరసింహమూర్తి బుధవారం తిరుమలకు వచ్చాడు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ జాయింట్ సెక్రటరీ హోదాతో ఉన్న గుర్తింపుకార్డును చూపి 11వ తేదీకి నాలుగు ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు జారీ చేయాలని సిఫార్సు లేఖను సమర్పించాడు. అనుమానించిన టీటీడీ ఈవో కార్యాలయ సిబ్బంది విజిలెన్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. నరసింహమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ అని తేలడంతో తిరుమల టూటౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నరసింహమూర్తి ఐఏఎస్ అధికారే కాదని స్పష్టమైంది.