Hyderabad: కాయ్ రాజా కాయ్.. ఆన్ లైన్ లో జోరుగా బెట్టింగ్.. కట్ చేస్తే..
ABN , Publish Date - Apr 13 , 2024 | 05:52 PM
ఇది ఐపీఎల్ ( IPL ) సీజన్. రోజుకో మ్యాచ్, వీకెండ్ లలో రోజుకు రెండు మ్యాచ్ లు, వీటితో పాటు అంతర్జాతీయ సిరీస్ లు, చిన్న చిన్న మ్యాచ్ లు, వార్మప్ మ్యాచ్ లు అదనం. ఈ సమయంలోనే బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు.
ఇది ఐపీఎల్ ( IPL ) సీజన్. రోజుకో మ్యాచ్, వీకెండ్ లలో రోజుకు రెండు మ్యాచ్ లు, వీటితో పాటు అంతర్జాతీయ సిరీస్ లు, చిన్న చిన్న మ్యాచ్ లు, వార్మప్ మ్యాచ్ లు అదనం. ఈ సమయంలోనే బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు. దోచుకున్నోడికి దోచుకున్నంత అని అమాయకులకు వల విసురుతున్నారు. వీరి వలలోచిక్కుకుని, డబ్బులు పోగొట్టుకుని సామాన్యులు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వీరిలో అత్యధికంగా చిరు వ్యాపారులు, విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగించే విషయం. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే అత్యాశతో వారు చితికిపోతున్నారు. బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయి బయటకు రాలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Hyderabad: రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్.. పట్టపగలు అందరూ చూస్తుండగానే..
హైదరాబాద్ లో ఆన్ లైన్ విధానంలో బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. బీఎస్ఎఫ్ఎల్ 666 బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. గచ్చిబౌలిలోని సిల్వర్ కీ ఓయో హోటల్ వేదికగా బెట్టింగ్ కు తెరలేపారు. పలువురిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.1.84 లక్షలు నగదు, ఐదు స్మార్ట్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం సమగ్ర విచారణ చేస్తున్నారు.
Andhra Pradesh: ఈదురు గాలుల బీభత్సం.. విజయవాడలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం..
బెట్టింగ్ భూతం అనేక దారుణాలకు ఉసిగొల్పుతుంది. అందుకే బెట్టింగ్ కు దూరంగా ఉండాలి. కాలక్షేపానికి మ్యాచ్ లు చూడటం మంచిదే. కానీ బెట్టింగ్ మోజులో పడి ఆట చూస్తూ ఆర్థికంగా కుదేలవడం మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని, వారు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టాలని సూచిస్తున్నారు. బెట్టింగ్ చేస్తున్నట్లు అనిపిస్తే సున్నితంగా మందలించాలి. పరిస్థితి చేయి జారిపోతున్నట్లు అనిపిస్తే మానసిక వైద్యులను సంప్రదించాలి. వారితో కౌన్సెలింగ్ ఇప్పించాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.