Home » Ashwini Vaishnav
ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాల దృశ్యాలను ప్రసారం చేసేటప్పుడు వాటిపై తేదీ, సమయానికి సంబంధించిన స్టాంపు ప్రసారమయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు టీవీ న్యూస్ చానళ్లను ఆదేశించింది.
‘‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లలో క్రీమీలేయర్ నిబంధన లేదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు చేసిన నిర్దిష్టమైన సూచనలపై క్యాబినెట్లో పూర్తిస్థాయిలో చర్చించాం. మేధో మథనం తర్వాత..
భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో(Indian Railways) 2019-20 నుండి 2023-24 వరకు 100 వందేభారత్ సర్వీసులతో సహా 772 రైలు సర్వీసులను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) శుక్రవారం రాజ్యసభలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్-2024లో రూ.9,151కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల రైల్వేల కోసం కేటాయించిన బడ్జెట్ వివరాలను ఆయన వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జూన్‌లో జరిగిన కాంచన్‌గంగా ఎక్స్‌ప్రెస్(Kanchanjunga Express) రైలు ప్రమాద ఘటనపై అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. గూడ్స్ రైలులో ఉన్న డ్రైవర్ సిగ్నల్‌ను తప్పుగా అర్థం చేసుకోవడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలంటే డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో లేదు. కేవలం బస్సు సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంది.
పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ నుంచి బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి బైక్‌పై ఘటనా స్థలికి చేరుకున్నారు.
పశ్చిమబెంగాల్ రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వలంగా గాయపడిన బాధితులకు రూ.50,000 ఎక్స్‌గ్రేషియా కంపెన్సేషన్ ఇవ్వనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే వందేభారత్ ఏసీ చైర్‌కార్ రైళ్లు అందుబాటులోకి రాగా.. తాజాగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది.
ఈరోజు విదేశాంగ మంత్రిగా ఎస్ జైశంకర్, రైల్వే మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నానికి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు.