Share News

Bengal train accident: రైలు ప్రమాద స్థలికి అశ్విని వైష్ణవ్... ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంపు

ABN , Publish Date - Jun 17 , 2024 | 02:41 PM

పశ్చిమబెంగాల్ రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వలంగా గాయపడిన బాధితులకు రూ.50,000 ఎక్స్‌గ్రేషియా కంపెన్సేషన్ ఇవ్వనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

Bengal train accident: రైలు ప్రమాద స్థలికి అశ్విని వైష్ణవ్... ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంపు

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని డార్జిలింగ్ జిల్లాల్లో కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్, గూడ్సు రైలు ఢీకొన్న ఘటనలో మృతులకు ఎక్స్‌గ్రేషియాను పెంచారు. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. దీంతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) హుటాహుటిన డార్జిలింగ్ బయలుదేరి వెళ్లారు. ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ప్రకటించారు. ఆ తర్వాత ఎక్స్‌గ్రేషియా పెంపును అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వలంగా గాయపడిన బాధితులకు రూ.50,000 ఎక్స్‌గ్రేషియా కంపెన్సేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

Train Collision: రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. పరిహారం ప్రకటించిన కేంద్రం


ఎన్‌ఎఫ్ఆర్ జోన్‌లో ప్రమాదం జరగడం దురదృష్టకమని, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయని అశ్వని వైష్ణవ్ తెలిపారు. రైల్వే, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ పూర్తి సమన్యయంతో చర్యలు చేపట్టినట్టు చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారని, సీనియర్ అధికారులు ఘటన స్థలికి చేరుకున్నారని వివరించారు. మృతుల సంఖ్య ఎంతనేది మాత్రం ఆయన తన పోస్ట్‌లో స్పష్టం చేయలేదు. బోగీలలో చిక్కుకున్న వారిని వెలికితీసే చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పలు వార్తా సంస్థలు చెబుతున్నాయి.

Updated Date - Jun 17 , 2024 | 02:41 PM