Home » Atchannaidu Kinjarapu
Andhrapradesh: విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడటాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తీవ్రంగా ఖండించింది. విశాఖకు డ్రగ్స్ క్యాపిటల్గా మార్చారంటూ మండిపడ్డారు. శనివారం మూడు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నాన్ని కార్యనిర్వహక రాజధానిగా చేస్తామంటే అందరూ మోసపోయారని... చివరకు విశాఖను డ్రగ్స్ క్యాపిటల్గా మర్చారంటూ ఏపీ తెలుగు దేశం పార్టీ చీఫ్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాల్లో ఒకటి శ్రీకాకుళం. గ్రామీణ వాతావరణం ఎక్కువుగా ఉండే ఈ జిల్లాలో ఇప్పటికీ వెనుకబాటు తనం ఎక్కువే. ఇంకా సరైన రహదారులు లేని గ్రామాలు శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో కనిపిస్తుంటాయి.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ వికలాంగుడంటూ ప్రభుత్వ సలహాదారు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Andhrapradesh: వైసీపీ రాక్షస జాతికి చెందిన పార్టీ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోతున్నా రన్న అక్కసుతో వైసీపీ రాక్షస మూకలు నరమేధం సాగిస్తున్నాయన్నారు. గిద్దలూరు నియోజకవర్గం గడికోటలో టీడీపీ నాయకుడు మూలయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ కార్యకర్తలపై దాడులు చేసినవారిని, హత్యలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Andhrapradesh: 23 వివిధ ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లలో ముఖ్యమంత్రి జగన్, మంత్రుల బొమ్మలు తొలగించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16, మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు.
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం తనను కలిసిన టీడీపీ నేతలపై చతురోక్తులు విసిరారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన గ్రూపు-1 ఉద్యోగాల భర్తీలో అక్రమాలపై విచారణ జరిపించాలని కోరడానికి వారు ఆయనను కలిశారు.
Andhrapradesh: ఎన్నికల్లో ఓటమి ఖాయమని టిక్కెట్ల దుకాణానికి జగన్ రెడ్డి గ్యాంగ్ తెరలేపిందని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీట్లు అమ్ముకుంటూ కోట్లు వెనకేసుకుంటూ అవినీతి సొమ్ముతో నెగ్గుకురావచ్చని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఒక వైపు ఓటర్లకు గిఫ్టులు పంచుతూ మరోవైపు అభ్యర్ధుల దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటున్నారన్నారు.
చిలకలూరిపేటలో మూడు పార్టీలు తలపెట్టిన ఉమ్మడి సభ నిర్వహణ కమిటీలతో సమావేశం ప్రారంభమైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది.
టీడీపీ దెబ్బకు ఆర్టీసీ దిగివచ్చింది. చిలకలూరిపేట సభకు ఎన్ని బస్లు కావాలో ఇండెంట్ ఇవ్వాలని టీడీపీని కోరింది. చిలకలూరిపేట సభకు తమకు బస్లు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీకి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.
శ్రీకాకుళం: రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు అధికారం చేపడతాయని, వైసీపీ కుక్కలు, సీఎం జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని.. దేశంలో పొత్తులు కొత్త కాదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.