Atchannaidu: జగన్ బొమ్మలను తొలగించండి.. ఎస్‌ఈసీకి అచ్చెన్న లేఖ
ABN , Publish Date - Mar 18 , 2024 | 01:07 PM
Andhrapradesh: 23 వివిధ ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లలో ముఖ్యమంత్రి జగన్, మంత్రుల బొమ్మలు తొలగించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16, మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు.
అమరావతి, మార్చి 18: 23 వివిధ ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లలో ముఖ్యమంత్రి జగన్, మంత్రుల బొమ్మలు తొలగించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16, మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కోడ్ అమల్లోకి వచ్చిన క్షణం నుంచి ప్రభుత్వ వెబ్ పేజీల్లో రాజకీయ పార్టీలకు చెందిన వారి ఫోటోలు ఉండరాదన్నారు. కానీ, ప్రభుత్వ వెబ్ పేజీల్లో నేటికీ ముఖ్యమంత్రి, మంత్రుల బొమ్మలు దర్శనమిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో సీఎం, మంత్రులు, రాజకీయ నాయకుల చిత్రాలు తొలగించాలంటూ వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సెక్రటీరీలకు, శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేయాలని ఎస్‌ఈసీకి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
iPhones: ఐఫోన్స్ కొనే వారికి అదిరిపోయే వార్త.. అక్కడ యాపిల్ డేస్ సేల్ బంపరాఫర్లు
PM Modi: కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన మోదీ.. ఆ ఇద్దరికీ వార్నింగ్..!
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..