Home » Atchannaidu Kinjarapu
ఓటమి భయంతోనే దస్తగిరి కుటుంబంపై జగన్ రౌడీలు దాడికి పాల్పడ్డారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బాబాయి బాత్రూం మర్డర్ కేసు మిస్టరీ వీడుతుందనే బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. దాడులు, దౌర్జన్యాలతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరని జగన్ తెలుసుకోవాలన్నారు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చల అనంతరం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. సీట్ల సర్దుబాటు అంశంపై కొద్ది సమయంలో బీజేపీ పెద్దలతో చర్చించి ఉమ్మడి ప్రకటన చేస్తామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని గ్రహించి తమ సహకారం కోసం బీజేపీ పెద్దలు ఆహ్వానించారని ఆయన పేర్కొన్నారు. గతంలో అమిత్ షా, నడ్డాను కలిసి అవగాహనకు వచ్చామని వివరించారు.
Andhrapradesh: చిలకలూరిపేట సభకు బస్సులు ఇవ్వాల్సిందే అని.. సభకు బస్సులు కావాలని ఈ రోజు లెటర్ పెడుతున్నామని, బస్సులు ఇవ్వకపోతే ప్రస్తుతం ఉన్న అధికారులు త్వరలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆర్టీసీ ఎండీని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
Andhrapradesh: వైసీపీ నేతలు 5 ఏళ్ల పాటు ల్యాండ్, శాండ్, వైన్, మైన్లో సంపాదించింది చాలక పేదలు భూమలు లాక్కుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి తుమ్మలగుంటలో హాథీరాంజీ మఠం స్థలంలోని పేదల ఇళ్లు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులపై సీఎం జగన్కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో సురక్షిత నీరు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం ముఖ్యమంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు.
ఏపీలో రూల్ ఆఫ్ లా లేదని.. వైసీపీ సభలకు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయడు పేర్కొన్నారు. టీడీపీ సభలకు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు నిరాకరిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు, ఉద్యోగసంఘాలు, ప్రజాసంఘాల కార్యక్రమాలకు అడ్డంకులు, నిర్బంధాలు, హౌస్ అరెస్టులు చేస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
‘రాజధాని ఫైల్స్’ సందేశాత్మకమైన సినిమా అని రాష్ట్ర హితం కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నేడు ఆయన రాజధాని ఫైల్స్ చూసిన అనంతరం తన రివ్యూ ఇచ్చారు. సినిమా తీసిన విధానంపై ఆయన ప్రశంసలు కురింపించారు. సినిమా ముగింపు చిత్రానికి హైలైట్ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్న ‘టెక్కలి శంఖారావం సభ’లో ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ జగన్ మోహన్ రెడ్డీ... పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగురవేస్తాం... కాసుకో’’ అంటూ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి రాబోయే కాలంలో నాయకత్వం వహించగల దమ్మున్న నేత నారా లోకేశ్ అని ఈ సందర్భంగా అన్నారు.
అమరావతి: సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై తెలుగుదేశం నేతలు అచ్చెన్నాయుడు, చినరాజప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కాళ్లపై పడటం, కాళ్ళు మొక్కటం వైసీపీ సంస్కృతే కానీ తెలుగుదేశానికి ఆ అవసరం లేదన్నారు. అనేక కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న జగనే వీటికి పాకులాడతారని నేతలు అన్నారు.
అమరావతి: రానున్న ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన చర్చలు కొలిక్కి వస్తున్నాయి. జనసేనకు కేటాయించే సీట్లపై దాదాపు స్పష్టత వచ్చింది. అలాగే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏడు సీట్లలో అభ్యర్థులను ఖరారు చేశారు.