Atchannaidu: ఆర్టీసీ ఎండీకి అచ్చెన్న హెచ్చరిక.. బస్సులు ఇవ్వకపోతే..
ABN , Publish Date - Mar 07 , 2024 | 12:26 PM
Andhrapradesh: చిలకలూరిపేట సభకు బస్సులు ఇవ్వాల్సిందే అని.. సభకు బస్సులు కావాలని ఈ రోజు లెటర్ పెడుతున్నామని, బస్సులు ఇవ్వకపోతే ప్రస్తుతం ఉన్న అధికారులు త్వరలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆర్టీసీ ఎండీని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
అమరావతి, మార్చి 7: ఈనెల 17న భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ, జనసేన పార్టీలు(TDP-Janasena) నిర్ణయించినట్లు టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) ప్రకటించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో బహిరంగసభ ఉంటుందని... ఈ సభలో సూపర్ సిక్స్, ఉమ్మడి మానిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే టీడీపీ (TDP) సభల కోసం బస్సులు ఇచ్చేందుకు ఆర్టీసీ ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిలకలూరిపేట సభకు బస్సులు ఇవ్వాల్సిందే అని.. సభకు బస్సులు కావాలని ఈ రోజు లెటర్ పెడుతున్నామని, బస్సులు ఇవ్వకపోతే ప్రస్తుతం ఉన్న అధికారులు త్వరలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆర్టీసీ ఎండీని (RTC MD) హెచ్చరించారు. గతంలో ఎప్పుడూ ఇలా అధికారులు వ్యవహరించలేదని.. ఏ రాజకీయ పార్టీ సభా నిర్వహించిన బస్సులు ఇచ్చేవారన్నారు. ఇప్పుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు.
MLC Kavitha: లిక్కర్ కేసు...పెద్ద కేసు కాదు: ఎమ్మెల్సీ కవిత
తక్షణమే స్పందిస్తాం...
ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ - జన సేన పొత్తు అని స్పష్టం చేశారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత రెండు పార్టీల మధ్య తగాదాలు పెట్టాలని వైసీపీ (YSRCP) ప్రయత్నించిందని మండిపడ్డారు. చరిత్ర సృష్టించేలా 10 లక్షల మందితో సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో పనిచేసేవారికి పోలీసులు ఫోన్‌లు చేసి బెదిరిస్తున్నారన్నారు. ‘‘మీ మీద కేసులు పెడుతున్నాను.. పోలీస్ స్టేషన్‌కు రమ్మని బెదిరిస్తున్నారు’’ అని తెలిపారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎవరు స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అందరూ నిర్భయంగా ఉండాలన్నారు. పోలీసుల తీరుపై అవసరం అయితే న్యాయపరంగా ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు. టీడీపీ - జనసెన సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తే 7306299999 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయవచ్చని.. టీడీపీ తక్షణమే స్పందిస్తుందని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Malkajgiri MLA: మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు
AP News: జగన్ పర్యటన.. ప్రజల ఆవేదన.. ఏం జరిగిందంటే?
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...