Atchennaidu: బాబాయి బాత్రూం మర్డర్ కేసు మిస్టరీ వీడుతుందనే బెదిరింపులు..
ABN , Publish Date - Mar 09 , 2024 | 01:47 PM
ఓటమి భయంతోనే దస్తగిరి కుటుంబంపై జగన్ రౌడీలు దాడికి పాల్పడ్డారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బాబాయి బాత్రూం మర్డర్ కేసు మిస్టరీ వీడుతుందనే బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. దాడులు, దౌర్జన్యాలతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరని జగన్ తెలుసుకోవాలన్నారు.
అమరావతి: ఓటమి భయంతోనే దస్తగిరి (Dastagiri) కుటుంబంపై జగన్ రౌడీలు దాడికి పాల్పడ్డారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchennaidu) పేర్కొన్నారు. బాబాయి బాత్రూం మర్డర్ కేసు మిస్టరీ వీడుతుందనే బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. దాడులు, దౌర్జన్యాలతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరని జగన్ (CM Jagan) తెలుసుకోవాలన్నారు. వివేకా (YS Viveka) హత్య కేసులో అప్రూవర్ షేక్ దస్తగిరి తండ్రి షేక్ హజీవలిపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.ఒకవైపు చెల్లెల్లు, మరోవైపు వివేకా హత్యలో నిందితుడు దస్తగిరి వాస్తవాలు బహిర్గతం చేస్తారనే భయంతో జగన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడన్నారు. పులివెందులో జగన్ రెడ్డి అరాచకాలకు, అకృత్యాలకు కాలం చెల్లిందన్నారు.
YCP: ఉత్తరాంధ్ర నేతలతో సజ్జల, వైవీ సుబ్బారెడ్డి సమావేశం.. ఆంతర్యమేంటో..!
వైఎస్ ఫ్యామిలీ నాలుగైదు దశాబ్దాలుగా పులివెందులను శాసించారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇప్పుడు వివేకా హత్య కేసులో జగన్ రెడ్డి ముసుగు తొలగిపోవడంతో పులివెందుల ప్రజలే తిరుగుబాటుకు సిద్ధమయ్యారన్నారు. ఆ ఫ్రస్టేషన్లో దాడులకు తెగబడుతున్నాడన్నారు. కేసులు, దాడులు, దౌర్జన్యాలతో భయపెట్టి కాలం నెట్టుకు రావాలని చూస్తున్నారన్నారు. వివేకా హత్యకు గొడ్డలి అందించిన చేయి ఎవరిదో దస్తగిరి రెండు రోజుల క్రితం బయటపెట్టాడని అచ్చెన్నాయుడు తెలిపారు. జగన్ రెడ్డి హత్యా రాజకీయాలకు, దాడులు, దౌర్జన్యాలకు కాలం చెల్లిందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇంకా నీ నియంతృత్వ పోకడలు, ఫ్యాక్షన్ వ్యవహారం చెల్లదన్నారు. దస్తగిరి తండ్రిపై దాడి చేయడంతోనే పులివెందులలో జగన్ రెడ్డి ఓటమి ఖరారైపోయిందన్నారు. తక్షణమే దాడి చేసిన వారిని అరెస్టు చేయాలన్నారు. దస్తగిరి కుటుంబానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని అచ్చెన్నాయుడు కోరారు.
TDP-Janasena-BJP: షాతో ముగిసిన చంద్రబాబు, పవన్‌ల భేటీ.. ఎవరికి ఎన్ని సీట్లంటే..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.