Home » Australia
Year End 2023: క్రికెట్లో ఈ ఏడాది ఆస్ట్రేలియా ఎంతో కలిసొచ్చిందనే చెప్పాలి. టెస్టుల్లో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డేల్లో ఐసీసీ వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. దీంతో 2023 ఆస్ట్రేలియాకు మరపురాని సంవత్సరంగా నిలుస్తోంది. తాజాగా ఈ ఏడాదిని విజయంతో ముగించాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.
కొందరు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైతే చాలు.. చేస్తున్న పనిని కూడా పక్కన పెట్టేస్తుంటారు. మరికొందరు ఎన్ని సమస్యలొచ్చినా ఎదుర్కొంటూ చివరకు అనుకున్న పనిని పూర్తి చేస్తుంటారు. ఇలాంటి...
Cameron Green: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తనకు దీర్ఘకాలిక వ్యాధి ఉందని.. ఈ విషయం ఇప్పటివరకు దాచిపెట్టానని వివరించాడు. తాను చిన్నతనం నుంచే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని.. అయితే ఇది పూర్తిగా నయంకాని వ్యాధి అని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
AUS vs PAK: ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్ ముందు ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో పాకిస్థాన్ వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో ఒక బంతికి ఏడు పరుగులు సాధించడంతో ప్రైమ్ మినిస్టర్స్ XI ఆటగాడు మాథ్యూ రెన్షా హాఫ్ సెంచరీ సాధించాడు.
Indian Man Dies In Australia: దేశం కాని దేశంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయం చేయాల్సిందిగా దాతలను ఓ ఎన్నారై భార్య (NRI Wife) విన్నవిస్తోంది.
Team India: రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సాధించే అవకాశం ఉండగా.. ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేయడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 175 పరుగుల మార్క్ నిలిచింది.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో టీ20లోనూ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో ఊచకోత కోశాడు.
Team India: ఆస్ట్రేలియాతో ఆడుతున్న తొలి రెండు మ్యాచ్‌లలో రింకూ సింగ్ చివరి ఓవర్లలో స్ట్రయికింగ్ చేస్తూ అత్యధిక పరుగులు రాబడుతున్నాడు. టీ20 క్రికెట్లో 19, 20 ఓవర్లలో 30కి పైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దీంతో గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో మరోసారి చివరి రెండు ఓవర్లలో రింకూ సింగ్ చెలరేగితే అత్యధిక సార్లు చివరి రెండు ఓవర్లలో 30కి పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీని అధిగమిస్తాడు.
T20 Cricket: టీమిండియా ఈరోజు గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టీ20లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే టీ20 సిరీస్‌తో పాటు ప్రపంచ రికార్డును సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నాలుగు మార్పులతో తాము బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు.
టీమిండియా మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు స్టార్ గ్రూప్‌తో పోటీ పడి హక్కులు దక్కించుకున్న జియో సినిమా వ్యూయర్ షిప్లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఐపీఎల్ తరహాలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతో జియో సినిమాను చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఇష్టపడుతున్నారు. అయితే తిరువనంతపురం వేదికగా ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ను ఏకంగా 15 కోట్ల మంది చూశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.