Share News

IND Vs AUS: సెంచరీతో రుతురాజ్ విధ్వంసం.. టీమిండియా మళ్లీ భారీ స్కోరు

ABN , First Publish Date - 2023-11-28T20:54:04+05:30 IST

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో టీ20లోనూ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో ఊచకోత కోశాడు.

IND Vs AUS: సెంచరీతో రుతురాజ్ విధ్వంసం.. టీమిండియా మళ్లీ భారీ స్కోరు

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో టీ20లోనూ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో ఊచకోత కోశాడు. చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. 57 బాల్స్‌లో 13 ఫోర్లు, 7 సిక్సర్లతో 123 రన్స్ చేసి అజేయంగా ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో రుతురాజ్‌కు ఇదే తొలి సెంచరీ. అంతేకాకుండా ఇదే అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలు చేసిన యషస్వీ జైశ్వాల్, ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు. జైశ్వాల్ (6), ఇషాన్ కిషన్ (0) తొలి మూడు ఓవర్లలోనే పెవిలియన్ చేరారు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ జట్టు స్కోరు వేగం పెంచాడు. 29 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 రన్స్ చేశాడు. సూర్య అవుటైన తర్వాత వచ్చిన తిలక్ వర్మ ఎక్కువ షాట్లు ఆడేందుకు వెళ్లకుండా క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాడు. మరో ఎండ్‌లో రుతురాజ్ వీరవిహారం చేశాడు. నాలుగో వికెట్‌కు రుతురాజ్-తిలక్ వర్మ 141 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా.. ఇందులో తిలక్ వర్మ చేసిన పరుగులు కేవలం 31 మాత్రమే. ఆస్ట్రేలియా బౌలర్లలో బెరన్ డార్ఫ్ మినహా అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఐదు టీ20ల సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా గెలవాలి.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-28T20:54:05+05:30 IST