Home » avanthi Srinivas
సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగారు. సోమవారం నాడు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ.. ఎక్కడో తేడా కొట్టినట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందనే అనుమానాలు వైసీపీ క్యాడర్‌లో గట్టిగానే వస్తున్నాయ్. ఇందుకు కారణం..
విశాఖ: భీమిలీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు చేదు అనుభవం ఎదురైంది. పద్మనాభం మండలంలో అవంతి ప్రసంగానికి అడుగడుగునా స్థానిక మహిళలు, యువకులు అడ్డు తగిలారు. నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయలేదని, ఏ సమస్య పరిస్కరించలేదని స్థానికులు అవంతిని గట్టిగా నిలదీసారు.
Andhrapradesh: స్థానిక ప్రజలపై భీమిలీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు చిందులు తొక్కడం విమర్శలు దారి తీసింది. జగనన్న ఇళ్లస్థలాల పట్టాలు పంపిణీ సందర్భంగా అవంతి శ్రీనివాస్, స్థానికుల యువకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. నియోజవర్గంలో సమస్యలను ఎందుకు పరిష్కరించ లేదని అవంతిని స్థానిక యువకులు నిలదీశారు.
Andhrapradesh: విశాఖలో మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. విద్యుత్ చార్జీల పెంపుపై భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుని ఓ మహిళ గట్టిగా నిలదీసింది. జగన్ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని మండిపడింది. కరెంట్ చార్జీల పెంపుతో పేదలు బతకలేక పోతున్నారని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
Andhrapradesh: వాలంటీర్లకు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇచ్చిన వార్నింగ్‌లు ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి. వైసీపీ సమావేశాలకు, సభలకు రాని వాలంటీర్లను పీకేస్తామని మాజీ మంత్రి బహిరంగంగానే బెదిరింపులు దిగారు. జగన్‌కు ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్లే ఉంటారని, లేనివారిని ఉండరని వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు ఖచ్చితంగా ఆక్టివ్‌గా ఉండాలని హెచ్చరించారు.
విశాఖ: మాజీ మంత్రి (Ex Minister) అవంతి శ్రీనివాస్ (Avanti Srinivas)కు సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా...