YSRCP: అవంతి శ్రీనివాస్ వార్నింగ్‌కు గట్టి సమాధానమే ఇచ్చిన యువకులు
ABN , Publish Date - Mar 15 , 2024 | 11:13 AM
Andhrapradesh: స్థానిక ప్రజలపై భీమిలీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు చిందులు తొక్కడం విమర్శలు దారి తీసింది. జగనన్న ఇళ్లస్థలాల పట్టాలు పంపిణీ సందర్భంగా అవంతి శ్రీనివాస్, స్థానికుల యువకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. నియోజవర్గంలో సమస్యలను ఎందుకు పరిష్కరించ లేదని అవంతిని స్థానిక యువకులు నిలదీశారు.
విశాఖపట్నం, మార్చి 15: స్థానిక ప్రజలపై భీమిలీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు (Former Minister Avanti Srinivas rao) చిందులు తొక్కడం విమర్శలు దారి తీసింది. జగనన్న ఇళ్లస్థలాల పట్టాలు పంపిణీ సందర్భంగా అవంతి శ్రీనివాస్, స్థానికుల యువకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. నియోజవర్గంలో సమస్యలను ఎందుకు పరిష్కరించ లేదని అవంతిని స్థానిక యువకులు నిలదీశారు. దీంతో స్థానిక ప్రజల పట్ల మాజీ మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ‘‘నా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు... ఎగస్ట్రాలు మాట్లాడవద్దు’’ అని వార్నింగ్ ఇచ్చారు. అయితే అవంతి బెదిరింపులకు భయపడని స్థానికులు తిరిగి ఆయననే ఎదురించారు. ‘‘ఎగస్ట్రాలు మేము మాట్లాడం లేదు... మా ప్రాంతంలో కాలువ నిర్మిస్తాం మీరు హామీ ఇచ్చారు.. ఇపుడు అదే అడుగుతున్నాము’’ అని యువకులు గట్టిగా ప్రశ్నించడంతో అవాక్కవడం అవంతి వంతైంది. ప్రశ్నించిన స్థానికులను అవంతి శ్రీనివాసరావు బెదిరింపులకు దిగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
Telangana: ఫోన్ ట్యాపింగ్.. సంచలన విషయాలు వెల్లడించిన ప్రణీత్ రావు..!
Tirumala News: తిరుమలలో ‘బంగారు’ బాబు.. అవాక్కైన జనాలు..!
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...