YSRCP: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు చూస్తుంటే వైఎస్సార్సీపీ ఓడిపోతుందని ఒప్పుకున్నట్టేనా..!
ABN , Publish Date - Mar 02 , 2024 | 12:25 PM
Andhrapradesh: వాలంటీర్లకు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇచ్చిన వార్నింగ్‌లు ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి. వైసీపీ సమావేశాలకు, సభలకు రాని వాలంటీర్లను పీకేస్తామని మాజీ మంత్రి బహిరంగంగానే బెదిరింపులు దిగారు. జగన్‌కు ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్లే ఉంటారని, లేనివారిని ఉండరని వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు ఖచ్చితంగా ఆక్టివ్‌గా ఉండాలని హెచ్చరించారు.
విశాఖపట్నం, మార్చి 2: వాలంటీర్లకు (volunteers) మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు (Former minister Avanthi Srinivas) ఇచ్చిన వార్నింగ్‌లు ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి. వైసీపీ సమావేశాలకు, సభలకు రాని వాలంటీర్లను పీకేస్తామని మాజీ మంత్రి బహిరంగంగానే బెదిరింపులు దిగారు. జగన్‌కు (CM Jagan) ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్లే ఉంటారని, లేనివారిని ఉండరని వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు ఖచ్చితంగా ఆక్టివ్‌గా ఉండాలని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో పొరపాటున జగన్ ఓడిపోయి... చంద్రబాబు (TDP Chief Chandrababi Naidu) ముఖ్యమంత్రి అయితే భవిష్యత్తు ఉండదని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వాలంటీర్లు ఉండరని.. సచివాలయాలు ఉండవంటూ కామెంట్స్ చేశారు.
నిన్న (శుక్రవారం) భీమిలి మండలం తాళ్లవలసలో పలు అభివృద్ధి, శంఖుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా అవంతి ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాలకు 11 మంది వాలంటీర్లు రాలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు పని తీరు ఎలా ఉందో స్థానిక ప్రజల నుంచి అరా తీశారు. జనవరిలో ఇదే పంచాయతీలో పింఛన్ల పెంపు సభకు రాలేదని నెపంతో పెదనాగమయ్యపాలెం చెందిన నలుగురు వాలంటీర్లను ఫిబ్రవరి నెలలో తొలగించేశారు. అయితే రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని అవంతి ఒప్పుకున్నారని... అందుకే సహనం కోల్పోయి ఇలాంటి వ్యాఖ్య లు చేస్తున్నారని టీడీపీ నేతలు (TDP Leaders) విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇవి కూడా చదవండి....
Gorantla: వివేకా హత్య కేసులో జగన్ పాత్రపై గోరంట్ల సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: పంచ భూతాలకు పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోంది
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...