Home » Ayodhya Ram mandir
అయోధ్యకు వచ్చే భక్తులకు తిలకం దిద్దే ఓ బాలుడు రోజుకు ఎంత సంపాదిస్తాడో తెలిసి జనాలు షాకైపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. నేనేమీ డాక్టర్ కంటే తక్కువగా కాదని ధీమాగా చెప్పిన అతడి తీరు జనాలకు విపరీతంగా నచ్చేసింది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్న ప్రధాని మోదీ ఆదివారం ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యకు చేరుకున్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ(BJP) స్పీడ్ పెంచింది. వరుస సభలు, ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మే 5న ఆయన ఉత్తరప్రదేశ్లో(UP) ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం బీజేపీకి లేదని, పైగా రాజ్యాంగానికి తాము మరింత గౌరవం తెస్తామని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
అయోధ్యలో కొలువు తీరిన శ్రీరాముడిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం దర్శించుకున్నారు. ఆ క్రమంలో శ్రీరాముడికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ముర్మ అయోధ్య ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు.
అయోధ్య రామ్ లల్లా భక్తులకు ఆలయ ట్రస్ట్ కీలక అప్డేట్ చేసింది. శ్రీరామనవమి కారణంగా కొంతకాలంగా నిలిపివేసిన వీవీఐపీ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. ఈరోజు నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
శ్రీరాముని జన్మదినోత్సవం రోజున ఆ బాలరామునికి జరిగిన సూర్య తిలకం వేడుక మీద సర్వత్రా చర్చ నెలకొంది. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సూర్యతిలకం వేడుక వెనుక ఉన్న నిజమిదే..
అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరామనవమి రోజున ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటిపై ‘సూర్య తిలకం’లా సూర్య కిరణాలు ప్రసరించాయి. కొన్ని నిమిషాల పాటు కనిపించిన ఈ ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు రాములోరి ఆలయానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు.
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్య ( Ayodhya ) బాల రాముని ఆలయంలోని మూల విరాట్ నుదుటిపై సూర్యకిరణాలు పడే విధంగా సూర్య తిలకం ఏర్పాటు చేశారు. సూర్యుని నుంచి వచ్చే కిరణాలను కటకాలు, దర్పణాల ద్వారా పరావర్తనం చెందించి రాముడి విగ్రహాన్ని తాకేలా రూపొందించారు.
అయోధ్య రామ్లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ట తరువాత బుధవారం తొలి శ్రీ రామ నవమి(Sri Rama Navami) వేడుకలు ఆలయంలో కనులపండువగా జరిగాయి.