Share News

Ayodhya land Scam: అయోధ్యలో భూ కుంభకోణం.. అఖిలేష్ సంచలన ఆరోపణలు..!

ABN , Publish Date - Jul 10 , 2024 | 05:15 PM

భారతీయ జనతా పార్టీ (BJP)పై సమాజ్ వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. బయటి వ్యక్తులు అయోధ్యకు వచ్చి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని, లాభాలు పొందడానికే ఇదంతా చేశారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల వ్యక్తులు అయోధ్యలో భూమి కొనడంవల్ల స్థానికులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు.

Ayodhya land Scam: అయోధ్యలో భూ కుంభకోణం.. అఖిలేష్ సంచలన ఆరోపణలు..!
Akilesh Yadav

భారతీయ జనతా పార్టీ (BJP)పై సమాజ్ వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. బయటి వ్యక్తులు అయోధ్యకు వచ్చి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని, లాభాలు పొందడానికే ఇదంతా చేశారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల వ్యక్తులు అయోధ్యలో భూమి కొనడంవల్ల స్థానికులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. బీజేపీ తప్పిదాలతోనే లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య లోక్‌సభ స్థానాన్ని బిజెపి కోల్పోయిందన్నారు. అయోధ్య లోక్‌సభ స్థానంలో ఎస్పీ అభ్యర్థి గెలుపొందిన తర్వాత.. ఆ నియోజకవర్గంపై అఖిలేష్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈక్రమంలో బుధవారం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ..అయోధ్య భూ ఒప్పందాలు బట్టబయలు అవుతున్నాయని.. బిజెపి పాలనలో అయోధ్య వెలుపల నుండి ప్రజలు లాభాలు సంపాదించడానికి అయోధ్యలో భూములు కొనుగోలు చేశారనే నిజం వెలుగులోకి వస్తోందని ఆరోపించారు. పెద్ద ఎత్తున భూఅక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం గత 7 సంవత్సరాలుగా అయోధ్య పరిధిలో భూములు రేట్లు పెంచకపోవడం వెనుక ఆర్థిక కుట్ర దాగిఉందన్నారు. దీంతో వేలకోట్ల రూపాయల భూ కుంభకోణాలు జరిగాయని, ఇక్కడ భూములు కొన్నది ల్యాండ్ మాఫియానే తప్ప స్థానిక ప్రజలు, సామాన్యులు కాదన్నారు.

Delhi Excise policy case: ఈడీ కొత్త ఛార్జిషీటు.. 37వ నిందితుడిగా కేజ్రీవాల్


అభివృద్ధిపేరుతో.. కుంభకోణం..!

అయోధ్య-ఫైజాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు భూక్రయ, విక్రయాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. నిరుపేదలు, రైతుల నుంచి భూములు తీసుకోవడం ఒక రకంగా భూమిని లాక్కోవడమేనని.. అయోధ్యలో అభివృద్ధి పేరుతో జరిగిన రిగ్గింగ్, భూ ఒప్పందాలపై సమగ్ర విచారణ జరపాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.

Pooja Khedkar : ట్రైయినీ ఐఏఎస్‌పై బదిలీ వేటు..


నేతల నుంచి అధికారుల వరకు..

రామమందిరం నిర్మాణంతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్‌ వ్యాపారులకు లబ్ధిచూకూర్చిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. అయోధ్యలో భూముల ధరలు వేగంగా పెరిగాయని.. దీని వెనుక ల్యాండ్ స్కాం జరిగిందని ఆరోపించారు. 2019 నవంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైందని, సుప్రీంకోర్టు నిర్ణయం నుండి మార్చి 2024 వరకు భూమి రిజిస్ట్రీ దర్యాప్తు జరిగిందని, అయోధ్యలోని కనీసం 25 గ్రామాలు చుట్టుపక్కల జిల్లాలైన గోండా, బస్తీలలో భూ లావాదేవీల సంఖ్య 30 శాతం వరకు పెరిగినట్లు తెలిపారు. ఆలయానికి 15 కిలోమీటర్ల పరిధిలో ఈ భూములు వస్తాయని, ఈ భూ ఒప్పందాలు చాలా వరకు రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు లేదా వారితో సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా జరిగాయని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలుభూముల క్రయవిక్రయాల్లో పాల్గొంటున్నారని అఖిలేష్ యాదవ్ తెలిపారు.


Nitish Kumar: మీ పాదాలకు మొక్కుతా... సహనం కోల్పోయిన సీఎం నితీష్

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 10 , 2024 | 05:47 PM