Share News

Ayodhya: రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్.. అయోధ్యలో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Jun 26 , 2024 | 10:58 AM

అయోధ్యలో మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌ నిర్మాణానికి టాటా సన్స్‌(TATA Sons) చేసిన ప్రతిపాదనకు యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) సర్కార్ అంగీకారం తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్(Museum of Temples) నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Ayodhya: రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్.. అయోధ్యలో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

లఖ్‌నవూ: అయోధ్యలో మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌ నిర్మాణానికి టాటా సన్స్‌(TATA Sons) చేసిన ప్రతిపాదనకు యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) సర్కార్ అంగీకారం తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్(Museum of Temples) నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అనంతరం పర్యావరణ శాఖ మంత్రి జైవీర్‌ సింగ్‌(Jaiveer Singh) సదరు వివరాలు వెల్లడించారు. మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌ కోసం రూ.1 నామమాత్రపు అద్దె ప్రాతిపదికన టూరిజం శాఖకు సంబంధించిన స్థలాన్ని 90 ఏళ్లపాటు లీజుకు ఇస్తామని చెప్పారు.


కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(CSR)లో భాగంగా టాటా సన్స్‌ ప్రతినిధులు గతంలోనే తమ ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా.. యోగీ సర్కార్‌ని సంప్రదించాలని సూచించిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనాలను ఇక్కడ తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

దీంతోపాటు టెంపుల్‌ సిటీ అయోధ్యలో మరో రూ.100 కోట్లతో టాటా సన్స్‌ చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పురాతన చారిత్రక కట్టడాలను పర్యాటక ప్రాంతాలుగా మెరుగులు దిద్దడంతోపాటు లఖ్‌నవూ, ప్రయాగ్‌రాజ్, కపిలవాస్తు ఏరియాల్లో పీపీపీ విధానంలో హెలికాప్టర్‌ సేవలను తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు.

.For Latest News and National News click here..

Updated Date - Jun 26 , 2024 | 11:04 AM