Home » Ayodhya Ram mandir
ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని రాంలాలా ఆలయంలో శ్రీరామునికి సూర్య తిలకం ఏర్పడింది. ఈ అరుదైన దృశ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) తాజాగా అసోం(assam)లోని నల్బరి(Nalbari) నుంచి రామ్ లల్లా సూర్య తిలకాన్ని ట్యాబ్ ద్వారా వీక్షించి దర్శించుకున్నారు.
అయోధ్య రామ్‌లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ట తరువాత బుధవారం తొలి శ్రీ రామ నవమి(Sri Rama Navami) వేడుకలు ఆలయంలో కనులపండువగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అందరి దృష్టి శ్రీ రాముడి నుదిటిపై పడే సూర్యుడి కిరణాలపై ఉంది.
శ్రీరామనవమి వేడుకలతో ఆధ్యాత్మిక శోభతో అయోధ్య ( Ayodhya ) పరవశిస్తోంది. రామ్ లల్లా సూర్య తిలకం కార్యక్రమానికి ముందు ఆలయ అర్చకులు బాల రాముడికి దివ్య అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.
శ్రీరామనవమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో రాం లల్లా కొలువుదీరిన తరువాత ఇదే తొలి రామనవమి అని అన్నారు. ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలించి రామ మందిరంలో బాల రాముడిని పూజించే భాగ్యం లభించిందని ప్రధాని చెప్పారు.
శ్రీరామ..!!.. ఇది పేరు మాత్రమే కాదు. భక్తజనకోటి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం. ఆనాడు.. హనుమంతుడికి సీతమ్మ ఇచ్చిన ముత్యాలహారంలో తన రామయ్య జాడ లేదని తిరస్కరించిన ఆ పవనసుతుడే రామభక్తిలో మనందరికీ ఆదర్శం.
అంగరంగ వైభవంగా బాలరాముడు కొలువుదీరిన అయోధ్యలో ( Ayodhya ) భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. రామ్ లల్లా సుందర రూపాన్ని చూసి తరించేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలో రద్దీ ఏర్పడుతోంది.
అయోధ్య రామ మందిరం(Ayodhya Ram Temple) ఇప్పుడు ప్రత్యేక శోభ సంతరించుకుంది. ఎందుకంటే 500 ఏళ్ల తర్వాత ఈ ప్యాలెస్‌లో రాంలాలా జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేటి నుంచి అయోధ్యలో చైత్ర నవరాత్రుల(Chaitra Navaratri) సందర్భంగా శ్రీరామ నవమి వేడుకలు మొదలయ్యాయి.
రాఘవుడు నడయాడిన నేలగా ఖ్యాతి గడించిన అయోధ్యలో బాల రాముడు కొలువయ్యాడు. రామ్ లల్లాను చూసేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ట్రస్టు కీలక ప్రకటన చేసింది.
అయోధ్య(Ayodhya) శ్రీ రామ్‌లల్లా ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ కనిపించింది. హోలీ పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి చూశారు. మధ్యాహ్నం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు. హోలీ కారణంగా అయోధ్య పట్టణం వెలిగిపోతోంది.
అయోధ్యలో(Ayodhya) రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగిన తరువాత తొలిసారి హోలీ పండుగ వేడుకలు ఘనంగా అవుతున్నాయి. భక్తులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.