Share News

Congress MLA: అయోధ్యలో సీతమ్మకు ఆలయం..

ABN , Publish Date - May 24 , 2024 | 12:53 PM

లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ విజయం సాధించి ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య నగరాన్ని మరింత అభివృద్ధి పరచడంతో పాటు సీతమ్మవారికి కూడా ఆలయం నిర్మిస్తామని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌(MLA EVKS Ilangovan) పేర్కొన్నారు.

Congress MLA: అయోధ్యలో సీతమ్మకు ఆలయం..

- కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌

చెన్నై: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ విజయం సాధించి ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య నగరాన్ని మరింత అభివృద్ధి పరచడంతో పాటు సీతమ్మవారికి కూడా ఆలయం నిర్మిస్తామని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌(MLA EVKS Ilangovan) పేర్కొన్నారు. రాయపేటలోని కాంగ్రెస్‌ కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో దివంగత టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు పి.రామచంద్రన్‌ వర్ధంతి సందర్భంగా గురువారం ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈవీకేఎస్‌ మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని మోదీ తన పుట్టుక గురించి ప్రజలను తప్పుదారి పట్టించేలా అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. నాశిరకం బొగ్గును తమిళనాడుకు సరఫరా చేసి సుమారు రూ.6,000 కోట్ల మోసానికి కేంద్రం పాల్పడిందని, ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ హస్తం కూడా ఉందని, అతడిని విచారించాలని డిమాండ్‌ చేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad kidney rocket: హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ మాఫియా గుట్టు రట్టు.. ఆ ఒక్కడి మృతితో..


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు(BJP state president) నగరంలోని ఆ పార్టీ కార్యాలయం కమలాలయంలో బీఫ్‌ విందు ఏర్పాటుచేస్తే తమ పార్టీ శ్రేణులంతా సంతోషంగా పాల్గొంటామని తెలిపారు. ఒడిశా పూరి జగన్నాఽథ ఆలయ భాండాగారం తాళం చెవులు తమిళనాడులో ఉన్నట్లు వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ, తమిళులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుందగై డిమాండ్‌ చేయడంలో తప్పులేదన్నారు. తమను కమలాలయానికి ఆహ్వానించిన అన్నామలై ఏర్పాటుచేసే విందులో తప్పనిసరిగా పశు మాంసం ఉండాలని కోరారు. డీఎంకే-కాంగ్రెస్‌ పార్టీలు ఒకే కూటమిలో ఉన్నాయని, మతశక్తులను తరిమివేసి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతోనే తాము కలిసి పోరాడుతున్నట్లు తెలిపారు. కామరాజర్‌ లాగే ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు రంగభాష్యం, ఎస్‌ఏ వాసు, ఏజీ చిదంబరం తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 24 , 2024 | 12:53 PM