Home » Balakrishna
పోలింగ్‌కు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో ప్రచార పర్వంలో టీడీపీ దూకుడు పెంచింది. ముఖ్యంగా టీడీపీ స్టార్ క్యాంపెయినర్ అయిన నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచారు. తమ పార్టీ అభ్యర్థులకు అండగా నిలుస్తూ ప్రచారం చేస్తున్నారు.
దేశంలోనే ఏపీ అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి తెచ్చారని ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర సాధికర సభలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఆయన మాట్లాడుతూ...
నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎక్స్ వేదికగా చేసిన ట్విట్ వైరల్ అవుతుంది. నేను ఎటువైపు ఉన్నానంటూ ఎవరైనా అడిగితే.. ఖచ్చితంగా మా కుటుంబం వైపే ఉంటాను. ఏ విధమైన అంశాలు ఆశించకుండా మా మామయ్య గారికి విష్ చేస్తున్నానని పేర్కొంది.
టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిని తట్టుకునే శక్తి ఎవరికీ లేదని హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురంను ఏ విధంగా అభివృద్ధి చేశామో ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న హిందూపురం అభివృద్ధి కోసం పని చేస్తున్నామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 20 నుంచి 30 సంవత్సరాలు రాష్ట్రం వెనుకబడిపోయిందన్నారు.
‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతోంది. టీడీపీ ప్రభుత్వంలో నవ్యాంధ్ర ప్రపంచపటంలోకి ఎక్కితే.. నేడు ఆ పేరు లేకుండా పోయింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. జగన్.. ఇక నీ ఆటలు సాగవు’’ అని సినీ హీరో, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి
సీఎం జగన్ (CM Jagan)కు ఏపీ ఎన్నికల్లో ఓటు వేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లేనని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సంచలన ఆరోపణలు చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. జనం అన్ని వదులుకొని రాష్ట్రం విడిచి పెట్టి పోవాల్సిందేనని అన్నారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో మంగళవారం నాడు బాలకృష్ణ రోడ్డు షో నిర్వహించారు.
మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రెడ్డి (CM Jagan) రైతులను నట్టేట ముంచారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. సోమవారం నాడు నందికొట్కూరు పటేల్ సెంటర్లో స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభ నిర్వహించారు. ఈ సభకు తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కర్నూలు: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సోమవారం నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్వర్ణాంద్ర సాకార యాత్ర చేయనున్నారు. ఇవాళ నందికొట్కూరు, కర్నూలులో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ( AP Elections 2024 ) వేళ ముఖ్య నేతలందరూ ప్రచారం ముమ్మరం చేశారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేపట్టారు.
నవరత్నాలతో సీఎం జగన్ (CM Jagan) ప్రజలను మోసం చేశారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. శనివారం నాడు కదిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నరసింహ స్వామి కదిరి ప్రాంతాన్ని కాపాడుతున్నారని తెలిపారు.