Home » Bandi Sanjay Kumar
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ బుధవారం తొలిసారి తన నియోజకవర్గానికి చేరుకున్నారు. కరీంనగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర మంత్రి సంజయ్‌ను గజమాలతో సత్కరించారు.
మెదక్‌లో శనివారం అల్లర్లకు పాల్పడిన వారిలో 45 మందిని గుర్తించామని, వీరిలో ఒక వర్గానికి చెందిన 23 మంది, మరో వర్గానికి చెందిన 22 మంది ఉన్నారని మల్టీజోన్-1 ఐజీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఆదివారం ఆయన పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు.
కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు రెండు కీలక పదవులు దక్కాయి. కేంద్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే బొగ్గు, గనుల శాఖను కిషన్‌రెడ్డికి కేటాయిస్తూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతలను పరిరక్షించే హోంశాఖకు సహాయ మంత్రిగా బండి సంజయ్‌ని నియమించారు.
రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.
కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు.
వారిద్దరూ బీజేపీలో అంకితభావం కలిగిన నేతలు. పార్టీ సిద్ధాంతమే ఊపిరిగా, అధినాయకత్వం ఆదేశాలే శిరోధార్యంగా పనిచేస్తూ సమర్థత నిరూపించుకున్న వారిద్దరూ కేంద్ర మంత్రులయ్యారు.
వారిద్దరూ బీజేపీలో అంకితభావం కలిగిన నేతలు. పార్టీ సిద్ధాంతమే ఊపిరిగా, అధినాయకత్వం ఆదేశాలే శిరోధార్యంగా పనిచేస్తూ సమర్థత నిరూపించుకున్న వారిద్దరూ కేంద్ర మంత్రులయ్యారు. ఆ ఇద్దరే... గంగాపురం కిషన్‌రెడ్డి, బండి సంజయ్. సికింద్రాబాద్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించిన కిషన్‌రెడ్డికి మరోసారి క్యాబినెట్ హోదా లభించగా, కరీంనగర్ నుంచి వరుసగా రెండోసారి గెలుపొందిన బండి సంజయ్‌కి, సహాయ మంత్రిగా అవకాశం వచ్చింది.
మోదీ జూన్ 9న మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో 50 మందికిపైగా మంత్రులతో కూడిన జంబో కేబినెట్ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనుంది. అయితే తెలంగాణ నుంచి ఇద్దరికి మంత్రి పదవి వరించగా అందులో ఒకరు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఆర్ఎస్ఎస్లో స్వయం సేవకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం కేంద్ర మంత్రి వరకు సాగింది. ఆయన జీవిత విశేషాలేంటో తెలుసుకుందాం.
దేశంలో మూడోసారి ఎన్డీయే కూటమి అధికారం చేపట్టబోతోంది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు కొద్దిమంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపుపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది.
రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్లో ఎవరెవరికి బెర్త్ లభించనుంది? మోదీ తన క్యాబినెట్లో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు? ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయం సాధించిన దృష్ట్యా, కేంద్ర క్యాబినెట్ కూర్పునకు సంబంధించి తెలంగాణ కోటాపై ఎలాంటి ప్రభావం పడనుంది? వంటి ప్రశ్నలపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.