BANDI SANJAY: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Dec 30 , 2024 | 02:50 PM
BANDI SANJAY: కమీషన్ల విషయంలో మంత్రుల మధ్య సఖ్యత లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఏమైనా జరగొచ్చు.. వాళ్లలో వాళ్లు ఏమైనా చేసుకోవచ్చని చెప్పారు. 14 శాతం కమిషన్ మీదే ప్రభుత్వం బతుకుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ముగ్గురు మంత్రుల బండారం బయట పెడుతామని బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.
కరీంనగర్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై పరోక్షంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు గొప్పో పవన్ కల్యాణ్‌కే తెలియాలని అన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేసినట్లుగా పవన్ కల్యాణ్ భావిస్తున్నారా అని ప్రశ్నించారు. పుష్ -2 మూవీ కలెక్షన్లలో రేవంత్‌కు 14 శాతం వాటా ముట్టిందేమోననే అనుమానం తనకు ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ(సోమవారం) కరీంనగర్‌లో బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... తెలంగాణ అసెంబ్లీ ఎందుకు పెట్టారంటే.. అల్లు అర్జున్ కోసం అన్నట్లుగా ఉందని విమర్శించారు. అల్లు అర్జున్‌కు రేవంత్‌కు ఎక్కడో చేడిందని ఆరోపించారు. ఒక వ్యక్తి గురించి ఇంతగా అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఏంటని బండి సంజయ్ నిలదీశారు. కాంగ్రెస్‌లో అంత్యర్యుద్ధం జరుగుతోందని బండి సంజయ్ విమర్శించారు.
కమీషన్ల విషయంలో మంత్రుల మధ్య సఖ్యత లేదని అన్నారు. కాంగ్రెస్‌లో ఏమైనా జరగొచ్చు.. వాళ్లలో వాళ్లు ఏమైనా చేసుకోవచ్చని షాకింగ్ కామెంట్స్ చేశారు. 14 శాతం కమీషన్ మీదే ప్రభుత్వం బతుకుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ముగ్గురు మంత్రుల బండారం బయట పెడతానని హెచ్చరించారు. బ్రోకర్లను పెట్టుకుని బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మంత్రులందరికీ సీఎం కావాలని ఉందని అన్నారు. ఢిల్లీకి డబ్బులు పంపడం వల్లే.. సీఎం పదవి నిలబడుతోందని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకుంటే మంత్రుల కుర్చీలు కూడా ఉండవని బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి
TG Assembly: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చరిత్ర సృష్టించారు: సీఎం రేవంత్..
BJP: కొత్త సంవత్సరంలో కొత్త బాస్‌లు.. కమలం పార్టీలో నయా జోష్
KTR: మన్మోహన్ సింగ్ భారత రత్నకు అర్హులే..: కేటీఆర్
Read Latest Telangana News and Telugu News