Home » Bandi Sanjay
తెలంగాణలో కాంగ్రెస్ (Congress) పాలన చివరి దాకా ఉండేలా లేదని... మధ్యలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ ట్యాపింగ్ కేసులో కరీంగనర్‌కు చెందిన ఓ మంత్రి కాపాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఆ మంత్రి చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు.
ను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల సంగతి ఏమైందని అడిగితే.. గుండు, అరగుండు అంటూ హేళనగా మాట్లాడుతావా?
రాముడి పేరు చెప్పి బీజేపీ (BJP) ఓట్లు అడుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణకు మోదీ గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. సీతారాముల కళ్యాణం చేసిన తర్వాత అక్షింతలు ఇస్తామని.. కానీ కల్యాణం జరగకముందే బీజేపీ నేతలు ఇక్కడ అక్షింతలు పంచారని చెప్పారు. రాముడిని బీజేపీ అవమానించిందని మండిపడ్డారు.
తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజుకుంటోంది. ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ అని.. ఆయనకు ఒకప్పుడు వేసుకునేందుకు బట్టలు కూడా ఉండేవి కావని ఎద్దేవా చేశారు. తనను గాలి తిరుగుడు అనడంపై బండి సంజయ్ మండిపడ్డారు
సిద్దిపేట జిల్లా: కోహెడలోని వెంకటేశ్వర గార్డెన్లో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఆరుగురు బీఆర్ఎస్ మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. నాలుగు నెలల తమ పాలనలో ఆరు గ్యారంటీలలో చేయాల్సినవి అమలు చేశామని స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లా: బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పేరుకు మాత్రమే ఇద్దరు.. కేసీఆర్ అనే నాణానికి వారిద్దరూ బొమ్మ బొరుసులాంటివారని కరీంనగర్ జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలే నమ్మే పరిస్థితిలో లేరని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) విమర్శించారు. సంజయ్ శనివారం ఉదయాన్నే కరీంనగర్ లోని ఓ కాలేజీ గ్రౌండ్లో మార్నింగ్ వాక్ కి వెళ్లారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.
నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడిన తాను.. లాఠీ దెబ్బలు తిన్నానని, వందలాది కేసులు పెట్టినా ప్రజలకు అండగా నిలిచానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు.
Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా కరీంగనర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, ఎంపీ బండి సంజయ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి. ఎన్నికల్ల ప్రచారంలో భాగంగా ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నువ్వెంత అంటే.. నువ్వెంత అన్న రేంజ్లో ఒరిపై ఒకరు దమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి పొన్నం సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతల పట్ల కూడా బండి సంజయ్ వ్యవహార శైలి సరిగా లేదంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బండి సంజయ్‌కు ఈటెల రాజేందర్‌కు విభేదాలున్నాయని అన్నారు.