Share News

TG: నా గుండుతో నీకేం పని రేవంతన్నా.. బండి సంజయ్‌కుమార్‌ .

ABN , Publish Date - May 01 , 2024 | 06:31 AM

ను కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల సంగతి ఏమైందని అడిగితే.. గుండు, అరగుండు అంటూ హేళనగా మాట్లాడుతావా?

TG: నా గుండుతో నీకేం పని రేవంతన్నా.. బండి సంజయ్‌కుమార్‌ .

నేను చేసిన అభివృద్ధి కనిపించట్లేదా?: బండి సంజయ్‌

సిరిసిల్ల రూరల్‌, ఏప్రిల్‌ 30: ‘నేను కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల సంగతి ఏమైందని అడిగితే.. గుండు, అరగుండు అంటూ హేళనగా మాట్లాడుతావా? నా గుండుతో నీకేం పని.. ఐదేళ్లలో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి, పోరాటాలు నీ కళ్లకు కనిపించడం లేదా రేవంతన్నా’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ప్రశ్నించారు.


సిరిసిల్లలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి వాడుతున్న భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. జమ్మికుంటలో సీఎం బహిరంగ సభ జనం లేక అట్టర్‌ ప్లాఫ్‌ అయ్యిందన్నారు. ప్రజలు కాంగ్రె్‌సను తిరస్కరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. జమ్మికుంట సభలో సీఎం చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయన్నారు. గాడిదగుడ్డు.. అరగుండు, గుండుసున్నా అంటూ వ్యక్తిగతంగా హేళన చేస్తే రాష్ట్ర జనాభాలో తన లాగే గుండు, అరగుండు ఉన్నవాళ్లు 50ు మంది ఉన్నారని, వాళ్లు మీ సంగతి, మీ పార్టీ సంగతి చూస్తారు జాగ్రత్త అని హెచ్చరించారు.

Updated Date - May 01 , 2024 | 06:31 AM