Congress: బండి సంజయ్‌కు మంత్రి పొన్నం సవాల్..
ABN , Publish Date - Apr 28 , 2024 | 01:49 PM
సిద్దిపేట జిల్లా: కోహెడలోని వెంకటేశ్వర గార్డెన్‌లో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఆరుగురు బీఆర్ఎస్ మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. నాలుగు నెలల తమ పాలనలో ఆరు గ్యారంటీలలో చేయాల్సినవి అమలు చేశామని స్పష్టం చేశారు.
సిద్దిపేట జిల్లా: కోహెడలోని వెంకటేశ్వర గార్డెన్‌లో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సమక్షంలో ఆరుగురు బీఆర్ఎస్ (BRS) మాజీ సర్పంచులు (Former serpenchas), ఎంపీటీసీ (MPTC) సభ్యుడు కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. నాలుగు నెలల తమ పాలనలో ఆరు గ్యారంటీలలో (Six Guarantees) చేయాల్సినవి అమలు చేశామని స్పష్టం చేశారు. 6 గ్యారంటీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానంటున్న బండి సంజయ్ (Bandi Sanjay) పది సంవత్సరాల బీజేపీ (BJP) ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసిందో చెప్పాలని సవాల్ (Challenge) చేస్తున్నానన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు బండి సంజయ్ నిరూపిస్తే కరీంనగర్‌లో మేము పోటీ నుంచి తప్పుకుంటామన్నారు. అవినీతి ఆరోపణల మీద పార్టీ అధ్యక్ష పదవి నుంచి తీసేసిన వ్యక్తి ఎంపీగా కొనసాగడానికి వీల్లేదన్నారు. ప్రజలు ఈ విషయాన్ని ఆలోచించాలని సూచించారు. తల్లిని నిందించి మాట్లాడిన క్రమంలో వెదవ అంటే ఆ మాటను వెయ్యేళ్లు ధనికుడిగా వర్ధిల్లు అని వక్రీకరిస్తున్నారన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం జగన్.. లాయర్ పొన్నవోలు మధ్య క్విడ్ ప్రోకో: షర్మిల
హైదరాబాద్: ఓ పబ్‌లో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలు
అనంతపురం: ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి రౌడీయిజం
మూడు రాజధానుల పేరుతో జనం చేతిలో చిప్ప
రాజీనామా లేఖతో రేవంత్ రెడ్డి రాలేదేం?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News