Home » Bandi Sanjay
భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్లో జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మూడోసారి దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు.
ఓట్లు కోసం శ్రీరాముడి పేరు వాడుకోవడం లేదని కరీంనగర్ ఎంపీ ఒండి సంజయ్ స్పష్టం చేశారు. భక్తితో రాముడి పేరు వాడుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్ వాళ్లు గుడిని మింగితే.. కాంగ్రెస్ వాళ్లు గుడి లోపలి లింగాన్ని మింగే రకమని ఆయన అభివర్ణించారు. ఆదివారం రాజన్న సిరిసిల్లలో పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం బీజేపీ పోరాడితే.. కాంగ్రెస్ వాళ్లకు ఓటు వేస్తారా ? అని ప్రశ్నించారు.
బీజేపీకి ఐదు వందల కోట్లు ఇచ్చినందుకే అరెస్టయిన అరబిందో డైరెక్టర్ పెనక శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాండ్ల విషయంలో బీజేపీ సమర్ధించుకుంటున్న తీరు గర్హనీయమన్నారు. అవినీతి డబ్బు పార్టీలకు వస్తే అది నీతివంతంగా మారిపోతుందా? అని ప్రశ్నించారు.
వరి కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు పేరిట క్వింటాలుకు 5 నుంచి 8 కిలోలు కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు....
జగిత్యాల: మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఉదయం కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్రమోదీ ఫోటో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా బండి సంజయ్? అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కాంగ్రెస్ కాళేశ్వరం అంటే బీఆర్ఎస్ కృష్ణ వాటర్ అని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ అంటే బీఆర్ఎస్ నీళ్లు ఇవ్వట్లేదని అంటుందని విమర్శించారు.
Telangana: బీజేపీ ఎంపీ బండి సంజయ్ ‘‘రైతు దీక్ష’’ ప్రారంభమైంది. రైతు సమస్యల పరిష్కారం కోసం మంగళవారం ఉదయం జిల్లాలోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు. రుణమాఫీ, పంట నష్ట పరిహారం, రూ.500 బోనస్ హామీలను అమలు చేయాలంటూ బీజేపీ ఎంపీ దీక్షకు దిగారు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.
కరీంనగర్: రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మంగళవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కేంద్రం వద్ద రైతు దీక్ష చేపట్టనున్నారు. రూ. రెండు లక్షల రుణమాఫీ, పంట నష్టం పరిహారం చెల్లింపుపై దీక్ష చేయనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష చేస్తారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ (BJP) నేతలు ప్రధాని మోదీ ఫొటోతో గెలిచే పరిస్థితిలో లేరని.. అందుకనే అయోధ్య రాముడి ఫొటోతో ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. 5 ఏళ్లలో కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఎంపీ బండి సంజయ్ ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
Telangana: భారత్ జనతా పార్టీ (బీజేపీ)లో ‘‘రజాకార్’’ సినిమా పంచాయితీ నెలకొంది. రజాకార్ సినిమా విషయంలో కమలం పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి. రజాకార్ సినిమాను చూడాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎంకరేజ్ చేశారు. చెప్పడమే కాకుండా కరీంనగర్లో స్వయంగా థియేటర్‌కు వెళ్లి మరీ రజాకార్ సినిమాను ఎంపీ చూశారు.