TS News: బండి సంజయ్ ‘రైతు దీక్ష’ ప్రారంభం
ABN , Publish Date - Apr 02 , 2024 | 10:39 AM
Telangana: బీజేపీ ఎంపీ బండి సంజయ్ ‘‘రైతు దీక్ష’’ ప్రారంభమైంది. రైతు సమస్యల పరిష్కారం కోసం మంగళవారం ఉదయం జిల్లాలోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు. రుణమాఫీ, పంట నష్ట పరిహారం, రూ.500 బోనస్ హామీలను అమలు చేయాలంటూ బీజేపీ ఎంపీ దీక్షకు దిగారు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.
కరీంనగర్, ఏప్రిల్ 2: బీజేపీ ఎంపీ బండి సంజయ్ (BJP MP Bandi Sanjay) ‘‘రైతు దీక్ష’’ ప్రారంభమైంది. రైతు సమస్యల పరిష్కారం కోసం మంగళవారం ఉదయం జిల్లాలోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు. రుణమాఫీ, పంట నష్ట పరిహారం, రూ.500 బోనస్ హామీలను అమలు చేయాలంటూ బీజేపీ ఎంపీ దీక్షకు దిగారు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.
Khushboo: ఇంతలోనే అంత మార్పా.. మనసు మార్చుకున్న ఖుష్బూ.. 4 నుంచి ఎన్డీయేకి మద్దతుగా ప్రచారం
రైతుల పక్షాన బీజేపీ డిమాండ్లు ఇవే..
‘‘తాలు, తేమ, తరుగుతో సంబంధం లేకుండా వడ్లను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇందిరమ్మ రైతు భరోసా కింద రైతులతోపాటు కౌలు రైతులుకు ఎకరాకు రూ.15 వేలు, భూమి లేని వ్యవసాయ కూలీలలకు రూ.12 వేలు ఇవ్వాలి. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులతో అనుసంధానించాలి. రైతు కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. సమగ్ర పంటల బీమాను అమలు చేసి రైతులతోపాటు రైతు కూలీలు, భూమిలేని రైతులకు సైతం బీమా పథకాన్ని వర్తింపజేయాలి. కొత్త సాగు విధానంతోపాటు పంటల సమగ్ర ప్రణాళికను విడుదల చేయాలి’’ అంటూ బీజేపీ డిమాండ్ చేసింది.
Elections 2024: వీవీ ప్యాట్‌లు లెక్కించాలని డిమాండ్.. వివరణ కోరిన సుప్రీం
నా దీక్షకు మద్దతు తెలిపండి: బండి సంజయ్
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఇప్పటి వరకు పరిహారం అందించలేదని, సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవటం లేదని బండి సంజయ్ విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. వడ్ల కల్లాల వద్ద బస చేసి.. రైతులు పడుతున్న బాధలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు. రైతు సంఘాలు, ప్రజా సంఘాలు తన దీక్షకు సంఘీభావం తెలపాలని కోరారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, 2-3 రోజుల్లో ప్రణాళికను వెల్లడిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Dharmana Prasada Rao: ఎవరికి ఓటేస్తారని ఎవరిని అడిగినా చంద్రబాబుకే అంటున్నారు
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు వచ్చినా.. బీజేపీ లక్ష్యం నెరవేరుతుందా..?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...