Share News

Bandi Sanjay: డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

ABN , Publish Date - Apr 04 , 2024 | 05:21 PM

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కాంగ్రెస్ కాళేశ్వరం అంటే బీఆర్ఎస్ కృష్ణ వాటర్ అని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ అంటే బీఆర్ఎస్ నీళ్లు ఇవ్వట్లేదని అంటుందని విమర్శించారు.

 Bandi Sanjay: డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

కరీంనగర్: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కాంగ్రెస్ కాళేశ్వరం అంటే బీఆర్ఎస్ కృష్ణ వాటర్ అని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ అంటే బీఆర్ఎస్ నీళ్లు ఇవ్వట్లేదని అంటుందన్నారు. గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. 6 గ్యారెంటీల అమలుపై చర్చ నడుస్తోందన్నారు. మహిళలకు రూ. 2500 , రూ. 4000 పెన్షన్ ఎక్కడ అని అడుగుతున్నారని చెప్పారు.

BRS: బీఆర్ఎస్‌ను దెబ్బేసింది ఇదే.. 'సారు'కు తెలిసొచ్చింది!


రైతు భరోసా రూ.15 వేలు ఎక్కడని రైతులు కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తున్నారన్నారు. వ్యవసాయ కూలీలు రూ.15 వేలు ఇవ్వట్లేదని, వడ్లకు రూ. 500 బోనస్ ఎందుకు ఇవ్వట్లేదని రైతులు నిలదీస్తున్నారన్నారు. ఈ హామీలన్నింటిపై ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకథ ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు. 100రోజుల పాలనపై మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు 6 గ్యారెంటీలపై ఎందుకు ప్రశ్నించడం లేదని బండి సంజయ్ అన్నారు.


KTR: నేతన్నలపై కాంగ్రెస్‌కు ఎందుకింత కక్ష..?: కేటీఆర్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 04 , 2024 | 05:27 PM