Home » Beauty
ఓపెన్ పోర్స్ అమ్మాయిలను చాలా ఇబ్బంది పెట్టే సమస్య. వీటినే డింపుల్ అని కూడా అంటారు. ముఖ చర్మం మీద రంధ్రాలు పెద్దగా తెరచుకుని ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడం కోసం అమ్మాయిలు చాలా రకాల చిట్కాలు ఫాలో అవుతుంటారు. అయితే ఆశించిన ఫలితాలు మాత్రం ఉండవు. అలాంటి వారికోసం సూపర్ టిప్స్ ఉన్నాయి.
జుట్టు పెరుగుదల కోసం ఇప్పటి అమ్మాయిలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. మార్కెట్లో దొరికే ఉత్పత్తుల నుండి, ఇంటి చిట్కాల వరకు ప్రతి ఒక్కటి ప్రయత్నిస్తుంటారు. అయితే..
ఫేస్ మాస్క్‌ను వేయడానికి కాఫీ గ్రౌండ్లను పెరుగు లేదా పాలతో కలపాలి. దీన్ని ముఖానికి అప్లయ్ చేసి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు.
చాలా మందికి ముఖంపై చిన్న మొటిమలు వస్తూ ఉంటాయి. అయితే చాలా సార్లు వీటికి కారణం తెలియదు. కారణం తెలియకుండా వీటి నివారణకు ప్రయత్నించటం కూడా సరికాదు.
ముఖం క్లిస్టర్ క్లియర్ గా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. దానికి తగినట్టే ఎన్నో సౌందర్య చిట్కాలు పాటిస్తుంది. ఇందులో ఫేస్ వ్యాక్సింగ్, షేవింగ్ వంటివి కూడా ఉంటాయి. అయితే ఇవి నొప్పితోనూ, ప్రమాదంతోనూ కూడుకున్నవి.
ఉల్లిపాయ.. ఈ మధ్యకాలంలో జుట్టు సంరక్షణలో చాలా పాపులర్ అయ్యింది. ఉల్లిపాయ జుట్టు రాలడాన్ని ఆపుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడంలోనూ, నల్లగా మారడంలోనూ, జుట్టు మందంగా మారడంలోనూ సహాయపడుతుంది. ఉల్లిపాయ సారంతో తయారుచేసిన షాంపూలు, హెయిర్ ఆయిల్స్, సీరమ్ వంటివి మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముడుపోతున్నాయంటే ఉల్లిపాయకున్న క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది.
పెరుగును ముఖానికి పూయడం అనేది అందరికీ పడకపోవచ్చు. అందుకని పెరుగు పూత వేసుకునే వారు ముందుగా పరీక్షించుకుని వేసుకోవాలి. దీనితో మరీ సున్నితమైన చర్మం ఉన్నవారిలో దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది.
జుట్టు సంరక్షణ చర్యలలో కొబ్బరి నూనె పాత్ర చాలా పెద్దది. ప్రతి మహిళ కనీసం వారంలో రెండు నుండి మూడు సార్లు అయినా తలకు కొబ్బరి నూనె పెడుతూ ఉంటుంది. ఇది జుట్టు పొడిబారడాన్ని నివారిస్తుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. అలాగే జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది. కానీ చాలామంది మహిళలు కొబ్బరినూనె వాడినా జుట్టు పెరుగుదలలో అంత మెరుగైన ఫలితాలు కనిపించడం లేదని అంటుంటారు.
టైబుల్ స్పూన్ పెరుగు కివీ పండ్లను ఒక గిన్నెలో వేసి మెత్తగా చేయాలి దీనిలో పెరుగు బాగా కలపాలి. ముఖం, మెడకు మాస్క్ ను అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఈ ఫ్యాక్ ను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
పెదవుల అందం కోసం ఆడవారు ఎంచుకునే ఈ లిప్ కలర్స్ గురించి ఓ ఆసక్తి కరమైన విషయం తెలుసుకోవాలి. మనం పెదవులకు ఎలాంటి కలర్ ఎంచుకుంటామో అది మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా చేస్తుందట.