Beauty Tips: వేసవిలో ముఖం మెరవాలంటే.. ఇంట్లోనే ఈ ఫేషియల్ ట్రై చేయండి..
ABN , Publish Date - Apr 08 , 2025 | 05:12 PM
వేసవిలో ఇంట్లోనే ఈ ఫేషియల్ చేసుకోవడం ద్వారా మీ చర్మం మెరిసిపోవడమే కాకుండా పార్లర్‌కు వెళ్లే ఖర్చును కూడా ఆదా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫేషియల్ ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం..

ప్రస్తుతం కాలంలో లైఫ్ చాలా బీజిగా మారిపోయింది. ఉదయం లేచిందే మొదలు ఇంట్లో పని, ఆఫీస్ అంటూ ఇలా రోజులు గడుస్తునే ఉన్నాయి. ఇక పార్లర్‌కి వెళ్ళడానికి సమయం కేటాయించడం కూడా చాలా కష్టంగా మారింది. అయితే, పార్లర్‌కి వెళ్ళకుండానే వేసవిలో ముఖం ప్రకాశవంతంగా మెరవాలంటే ఇంట్లోనే ఈ ఫేషియల్ ట్రై చేయండి. ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేస్తే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి
స్టీమ్ ఫేషియల్ తీసుకునే ముందు, మీ ముఖం పూర్తిగా శుభ్రంగా ఉండాలి. దీని కోసం, తేలికపాటి ఫేస్ వాష్ లేదా క్లెన్సర్ ఉపయోగించండి. తద్వారా చర్మం నుండి నూనె, మురికి, మేకప్ పూర్తిగా తొలగిపోతాయి.
ముఖాన్ని క్లెన్సర్ తో శుభ్రం చేసుకోండి
శుభ్రమైన చర్మంపై ఆవిరి మరింత ప్రభావవంతంగా ఉంటుంది. క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. ఇది ఆవిరి ప్రభావాన్ని మరింత పెంచుతుంది. మీరు డబుల్ క్లెన్సింగ్ ఉపయోగిస్తే, అది ముఖాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ఆవిరి ప్రభావాన్ని మరింత మెరుగ్గా చేస్తుంది.
ఆవిరి పట్టుకోండి
ఒక పాత్రలో వేడి నీటిని ఉంచి, మీ ముఖాన్ని దాని నుండి 8 నుండి 10 అంగుళాల దూరంలో ఉంచండి. నీరు మరీ వేడిగా ఉండకుండా చూసుకోండి. మీ తలపై ఒక పెద్ద టవల్ కప్పుకుని ఆవిరి బయటకు వెళ్లకుండా ముఖానికి ఆవిరి పట్టుకోండి. ముఖాన్ని టవల్‌తో కప్పడం వల్ల అవిరి చర్మంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది.
ఫేస్ మాస్క్ అప్లై చేయండి
ఆవిరి పట్టిన తర్వాత, మీ చర్మం పూర్తిగా రిలాక్స్ అవుతుంది. కాసేపు తర్వాత ఫేస్ మాస్క్ వేసుకోండి.ఫేస్ మాస్క్ చర్మ రంధ్రాలను బిగించడమే కాకుండా చర్మానికి లోతైన తేమ, పోషణ, మెరుపును అందిస్తుంది. ఇది మీ చర్మం టోన్, ఆకృతిని మెరుగుపరుస్తుంది. మీ ముఖం ఎంతో ప్రకాశవంతంగా మారుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఆపిల్ తిన్నాక నీళ్లు తాగుతున్నారా.. ఎంతసేపటికి తాగాలో తెలుసుకోండి..
ఈ రంగు బెడ్ షీట్ మీద పడుకుంటే అదృష్టం కలిసి రావాల్సిందే..
వివేకా హత్య కేసులో ట్విస్ట్ సీబీఐ ముందు సాక్షిగా షర్మిల !