Beauty Tips: పుట్టుమచ్చలను తొలగించడం ఎలా .. ఈ సింపుల్ టిప్స్ మీ కోసం..
ABN , Publish Date - Apr 10 , 2025 | 05:33 PM
చాలా మంది అమ్మాయిలు ముఖంపై పుట్టమచ్చలతో బాధపడుతుంటారు. అలాంటి వారు పుట్టుమచ్చలను తొలగించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా మంది అమ్మాయిలు ముఖంపై పుట్టమచ్చలతో బాధపడుతుంటారు. అలాంటి వారు పుట్టుమచ్చలను తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొందరు ఖరీదైన క్రీములు, మందులు ఉపయోగిస్తారు. ఇంకొందరు పుట్టుమచ్చలను తొలగించడానికి శస్త్ర చికిత్స కూడా చేయించుకుంటారు. అయితే, కొన్ని ఇంటి నివారణల సహాయంతో మనం పుట్టుమచ్చలను తొలగించవచ్చు. ముఖం మీద చాలా పుట్టుమచ్చలు ఉంటే, అది మీ అందాన్ని దెబ్బతీస్తుంది. మీ రూపం చెడుగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి, పుట్టుమచ్చలను ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కానీ, ఈ నివారణలు ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
నిమ్మకాయ ఆకులు
ఆకులను గ్రైండ్ చేసి, వాటిని సున్నంతో కలిపి మెత్తని పేస్ట్ లా చేసి పుట్టుమచ్చపై రాయండి. అరగంట తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
రోజ్ వాటర్, నిమ్మరసం
రోజ్ వాటర్ ని నిమ్మరసం కలిపి పుట్టుమచ్చ మీద అప్లై చేసి, ఆ పేస్ట్ ని అరగంట పాటు అలాగే ఉంచి, తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
నిమ్మకాయ, కలబంద
నిమ్మకాయ, కలబందను ఉపయోగించి పుట్టుమచ్చలను సులభంగా తొలగించవచ్చు . దీని కోసం ఒక చిటికెడు నిమ్మరసం, కలబంద జెల్ కలిపి పుట్టుమచ్చపై రాయండి. అరగంట తర్వాత నీటితో ఫేస్ ను శుభ్రం చేసుకోండి.
అరటితొక్క, నిమ్మకాయ
అరటిపండు తొక్క, నిమ్మకాయ తీసుకుని పేస్ట్ లా చేసి పుట్టుమచ్చ మీద రాయండి. ఒక గంట తర్వాత దానిని తీసివేసి చర్మాన్ని నీటితో శుభ్రం చేసుకోండి.
నీమ్మకాయ, నీరు
ఒక చెంచా నిమ్మరసం తీసుకుని దానికి నీళ్లు కలిపి పేస్ట్ లా చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ ను పుట్టుమచ్చపై ఆప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచి సాధారణ నీటితో వుభ్రం చేసుకోండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
Lemon Grass Tea: బీపీ, షుగర్ ఉన్నవాళ్లు లెమన్ గ్రాస్ టీ తాగవచ్చా..
Summer Health Tips: ఈ హెల్తీ డ్రింక్‌తో 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
Personal Finance: 10 ఏళ్లలో కోటిశ్వరులు కావడం ఎలా.. నెలకు ఎంత కట్టాలి