Home » Bengaluru
ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు కిడ్నీ అమ్ముదామనుకున్న ఓ చార్టర్డ్ అకౌంట్కు భారీ షాక్
వేసవికాలం మొదలుకాకముందే కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరుని(Bengaluru) పట్టి పీడిస్తున్న నీటి సమస్యకు సంబంధించిన వార్తే ఇది. బెంగళూరులోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీలో నివసిస్తున్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
బెంగళూరులో తాగు నీటి సంక్షోభం మరింత పెరిగింది. ఈ కారణంగా పలు స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు ఆన్లైన్ విధానంలో విద్యార్థులకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బెంగళూర్ రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో అధికారులు పురోగతి సాధించారు. ఐఈడీ బాంబ్ పెట్టిన వ్యక్తికి సంబంధించి కీలక ఆధారం లభించిందని పేర్కొన్నారు. బాంబ్ పెట్టిన అనుమానితుడి ఫొటో బీఎంటీసీ బస్సులో మాస్క్ లేకుండా కనిపించింది. కేఫ్ పేలుడులో కీలక ఆధారం లభించిందని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర ప్రకటించిన మరుసటి రోజు అధికారులు ఫొటోను విడుదల చేశారు.
చెన్నై - బెంగుళూరు వందేభారత్ రైలు(Vande Bharat train)ను ఈనెల 12వ తేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రారంభించనున్నారు.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో గత వారం భారీ పేలుడుకు కారణమైన వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నగదు బహుమతిని ప్రకటించింది. సమాచారం అందించిన వారికి రూ.10 లక్షలు బహుమతి ఇస్తామని తెలిపింది. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొంది.
బెంగళూర్ నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. నగరంలో గల అపార్ట్ మెంట్స్, ఇళ్లలో ఉన్న బోర్ల నుంచి నీరు రావడం లేదు. గత కొన్నిరోజుల నుంచి ఈ సమస్య ఉంది. నిత్యవసర అవసరం అయిన నీటిని కొందరు వ్యాపారంగా మారుస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు తరలిస్తూ దోచుకుంటున్నారు. ఇదే అంశంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడారు.
మనీ ల్యాండరింగ్ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. 2018 మనీ ల్యాండరింగ్ కేసును సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద డీకే శివకుమార్పై మోపిన అభియోగాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ అనురుద్ద బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం అభిప్రాయ పడింది.
రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) పేలుడుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పేలుడు ఘటనను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు. పేలుడు ఘటన విచారణను ఎన్ఐఏకు అప్పగించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదివారం నాడు ప్రకటన చేశారు. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పేలుడు ఘటనను ఎన్ఐఏకు ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని (Bengaluru) రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు (Rameshwaram Cafe Bomb Blast) కేసు వ్యవహారంలో కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర (G Parameshwara) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుళ్ల వెనుక వ్యాపార శత్రుత్వం కారణమై ఉంటుందా? త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ప్రయత్నంలో ఈ పేలుళ్లు ఒక భాగమా?