Movie Ticket Prices: మల్టీప్లెక్స్‌లోనూ రూ.200లోపే సినిమా టికెట్!
ABN , Publish Date - Mar 08 , 2025 | 05:44 AM
సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించారు. కన్నడ సినిమారంగానికి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో టికెట్ చార్జీలకు సీలింగ్ విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సినీ పరిశ్రమకు కర్ణాటక సర్కార్ షాక్
బెంగళూరు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): సినిమా రంగానికి కర్ణాటక ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. సినిమా టికెట్ ధర రూ.200కు మించరాదని సీఎం సిద్ధరామయ్య శుక్రవారం ప్రకటించారు. మల్టీప్లెక్స్‌లు సహా రాష్ట్రమంతటా అన్ని థియేటర్లలో ఈ మేరకు అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కన్నడ సినిమాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ఓటీటీ వేదికను ప్రారంభించనున్నట్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆయన తెలిపారు. సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించారు. కన్నడ సినిమారంగానికి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో టికెట్ చార్జీలకు సీలింగ్ విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.