Home » Bhadrachalam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చర్ల మండలంలో మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాలు వెలిసాయి. మావోయిస్టు అనుబంధ ఆదివాసీ విప్లవ మహిళా సంఘం, విప్లవ మహిళా సంఘం పేరుతో పోస్టర్లు, కరపత్రాలు వెలసాయి. మార్చి 8 వ తేదీన 114 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం జరుపుకోవాలని బ్యానర్లు, కరపత్రాలద్వారా పిలుపిచ్చారు.
Telangana Elections 2024: తెలంగాణలో (Telangana) పార్లమెంట్ ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అటు కాంగ్రెస్ (Congress).. ఇటు బీజేపీ (BJP) ఈ రెండు పార్టీలూ బీఆర్ఎస్ను (BRS) టార్గెట్ చేశాయి. ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్లో చేరిపోతుంటే.. ఎంపీలు ‘కారు’ దిగి కాషాయ కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. మరో నలుగురు సిట్టింగులు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం..
భద్రాద్రి రామాలయం(Bhadrachalam Sri Rama Temple) లో భారీ మోసం వెలుగుచూసింది. ఆలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే అధికారి చేసిన అవినీతి దందా ఆలస్యంగా బయటపడింది. మూడేళ్ల క్రితం సత్రం నిర్మాణానికి దాతలు రూ.18 లక్షల నగదును ఆలయానికి ఇచ్చారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనికి సంబధించిన తేదీలను నేడు వైదిక కమిటీ ప్రకటించింది. ఏప్రిల్ 9 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.17న శ్రీరామనవమి సందర్బంగా స్వామి వారి కళ్యాణం జరగనుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో ఆదివారం చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి పర్యటించనున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర జరగనుంది. ఈ సందర్భంగా చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి భద్రాద్రి నుంచి భారత్ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించనున్నారు.
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ సభ్యులు భద్రాచలం ఆలయ నిర్వాహకులను ఆహ్వానించ లేదని మండిపడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అయోధ్యలో సోమవారం బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మామిడి తోరణాలు, వివిధ రకాల పూలతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో బాగంగా ఆదివారం బేడా మండపంలో శ్రీ రంగనాథ గోదాదేవి కళ్యాణ వేడుక జరుగనుంది.
బిజినెస్ సరిగ్గా జరగాలంటే జనాలను ఆకర్షించాలి. కొత్త కొత్త ఆఫర్లు ప్రకటించాలి. అందుకే పండుగకు ముందు బిజినెస్
భద్రాచలంలో సోమవారం శ్రీ అయోధ్య అక్షింతల, కలశపూజ, శోభాయాత్రను విశ్వహిందూపరిషత్, బజరంగ్దళ్, ఆర్ఎస్ఎస్(RSS), హిందూ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు. తాతగుడి వద్ద గల శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి అయోధ్య శ్రీరామచంద్రస్వామి