Home » Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతల పెట్టిన విమానాశ్రయానికి ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయి. అక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై చేపట్టిన అధ్యయనం తుది దశకు చేరుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌తో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ.. ఛత్తీస్‌గడ్ సరిహద్దు వద్ద హై అలర్ట్ చేశారు. మావోయిస్టలు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దు నివురు గప్పిన నిప్పులా మారింది. భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు నిర్మించ తలపెట్టిన నేపథ్యంలో అక్కడ అధ్యయనం జరిపేందుకు కేంద్రం నిర్ణయించింది.
భూ సర్వే, నాలా కన్వర్షన్ కోసం లంచాలు తీసుకుంటూ సర్వేయర్, డిప్యూటీ తహసీల్దార్‌లు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో శనివారం ఈ ఘటనలు జరిగాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో రెండు రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి కంపించింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత 5 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7.27 గంటల సమయంలో ములుగులోని మేడారం కేంద్రంగా 3-7 సెకన్ల పాటు కొనసాగిన ప్రకంపనలతో కొన్ని చోట్ల ఇళ్ల గోడలు, నేల బీటలువారాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టుల కదలికలు కొంత తగ్గుముఖం పట్టినా.. అడపాదడపా జరిగిన ఎన్‌కౌంటర్లలో 60మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు.
ఓ యువకుడు, యువతి ప్రేమ.. సహజీవనంతో మొదలైన కథ.. కక్షలతో మలుపులు తిరిగింది. ఒక మహిళపై హత్యాయత్నానికి, మరో జంట ఆత్మహత్యకు, చివరికి ఆ యువతి హత్యకు దారితీసింది.
మాతా, శిశు మరణాల రేటు శాతం తగ్గించడానికి భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లీడర్‌షిప్ ట్రైనింగ్‌కు భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాకు చెందిన నర్సింగ్ ఆఫీసర్ సుర్నపు స్వప్న ఎంపికైంది. ప్రపంచంలోనే టెక్నాలజీలకు నిలయం, మాతా శిశు మర ణాల రేటు శాతం లేని దేశంగా పేరు ప్రఖ్యాతలు గడిచిన జపాన్ ఈ శిక్షణ కేంద్రానికి వేదిక కానుంది.
మాతా, శిశు మరణాల రేటు శాతం తగ్గించడానికి భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లీడర్‌షిప్ శిక్షణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్) పరిధిలోని రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) నర్సింగ్ అధికారి సూర్నపు స్వప్న ఎంపికయ్యారు.