Share News

Kothagudem: ‘జపాన్‌’ లీడర్‌షిప్‌ శిక్షణకు స్వప్న..

ABN , Publish Date - Nov 09 , 2024 | 01:17 PM

మాతా, శిశు మరణాల రేటు శాతం తగ్గించడానికి భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లీడర్‌షిప్‌ ట్రైనింగ్‌కు భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాకు చెందిన నర్సింగ్‌ ఆఫీసర్‌ సుర్నపు స్వప్న ఎంపికైంది. ప్రపంచంలోనే టెక్నాలజీలకు నిలయం, మాతా శిశు మర ణాల రేటు శాతం లేని దేశంగా పేరు ప్రఖ్యాతలు గడిచిన జపాన్‌ ఈ శిక్షణ కేంద్రానికి వేదిక కానుంది.

Kothagudem: ‘జపాన్‌’ లీడర్‌షిప్‌ శిక్షణకు స్వప్న..

- రామవరం ఎంసీహెచ్‌లో విధులు నిర్వహిస్తూ ఎంపిక

- 12వ తేదీ నుంచి 24 తేదీ పన్నెండు రోజుల పాటు ట్రైనింగ్‌

చుంచుపల్లి(కొత్తగూడెం): మాతా, శిశు మరణాల రేటు శాతం తగ్గించడానికి భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లీడర్‌షిప్‌ ట్రైనింగ్‌కు భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాకు చెందిన నర్సింగ్‌ ఆఫీసర్‌ సుర్నపు స్వప్న ఎంపికైంది. ప్రపంచంలోనే టెక్నాలజీలకు నిలయం, మాతా శిశు మర ణాల రేటు శాతం లేని దేశంగా పేరు ప్రఖ్యాతలు గడిచిన జపాన్‌ ఈ శిక్షణ కేంద్రానికి వేదిక కానుంది. జపాన్‌ దేశం మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కోసం చేపట్టిన విధి , విధానాలు, కార్యాచరణ, నియమాలను తెలుసుకునేందుకు ఏడుగురు సభ్యుల కూడిన భారతదేశ బృందం జపాన్‌కు వెళ్లనుంది. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్‌ ఆఫీసర్ల నైపుణ్యం - అనుభవం కలిగిన వారిని పంపించాలని నిర్ణయించారు.

ఈ వార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మోదీ అబద్ధాలు చెప్పడం మానాలి.. సీఎం రేవంత్ వార్నింగ్


kmmm.jpg

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఫ్యామిలీ అండ్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ రెండు జిల్లాల్లో పని చే స్తున్న ఇద్దరు నర్సింగ్‌ ఆఫీసర్ల పేర్లను ప్రతిపాదించి పంపించారు. ఈ క్రమంలో జపాన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రతినిధులు ఈ ఇద్దరిని శుక్రవారం ఎంపిక చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు ఈ ట్రైనింగ్‌ కొనసాగుతుంది. భద్రాద్రి జిల్లా నుంచి ఎంపికైన నర్సింగ్‌ ఆఫీసర్‌ సూర్నపు స్వప్నను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.


ప్రస్తుతం స్వప్న జిల్లాలోని కొత్తగూడెం సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్‌) పరిధిలోని రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో(ఎంసీహెచ్‌) విధులు నిర్వహిస్తోంది. నర్సింగ్‌ ఆఫీసర్‌ స్వప్నను తెలంగాణ నర్సింగ్‌ ఆఫీసర్‌ అసోసియేషన్‌ జోనల్‌ అధ్యక్షురాలు శుభశంకరి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతునేని సుదర్శన్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధామోహన్‌ అభినందించి శాలువతో సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు లిక్కి బాలరాజు, నాయకులు వీరన్న, జునుమాల నగేష్‌, నర్సింగ్‌ ఆఫీసర్లు తదితరులు ఉన్నారు


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌.. ఆన్‌లైన్‌లోనే!

ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: బెంగళూరులో ముగిసిన ‘హైడ్రా’ పర్యటన

ఈవార్తను కూడా చదవండి: jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటే కుక్కచావే

Read Latest Telangana News and National News

Updated Date - Nov 09 , 2024 | 01:17 PM