Home » Bharat Ratna
మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడం హర్షించ దగిన విషయమని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఆలస్యమైనా పీవీకు భారతరత్న రావటం చాలా సంతోషంగా ఉందని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. పీవీ అజాత శత్రువని.. అన్ని పార్టీల్లో నాన్నకు మిత్రులున్నారని చెప్పారు. పీవీ ఆర్థిక సంస్కరణల వల్లే భారతదేశం ఈ స్థితిలో ఉందని చెప్పారు.
దళిత ఐకాన్, బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' ఇవ్వాలని ఆ పార్టీ చీఫ్ మాయావతి డిమాండ్ చేశారు. మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, వ్యవసాయ శాస్త్రవేత ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం 'భారతరత్న' ప్రకటించిన కొద్దిసేపటికే మాయావతి తన డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారతరత్నగా కేంద్రం గుర్తించడం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హర్షం వ్యక్తం చేశారు. భారతరత్నగా పీవీని గుర్తించడం మోదీ గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు.
ఒకే ఏడాదిలో ఐదుగురు విశిష్ఠ వ్యక్తులకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న'ను ప్రకటించిన క్రెడిట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుంది. ఇది రికార్డు కూడా. 1954లో అవార్డులు స్థాపించిన తరువాత అత్యధికులకు భారతరత్న అవార్డు ప్రకటించిన ఏడాది 2024 కాడం విశేషం.
Sonia Gandhi Reaction on Bharat Ratna Award: దివంగత ప్రధాన మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ లకు శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రకటించింది. ఈ ముగ్గురు ప్రముఖులకు భారత రత్న ప్రకటించడంపై యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది.
భారతమ్మ బంగారు ముద్దు బిడ్డ, రాజనీతిజ్ఞుడు, బహూ బాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన మహానేత. పీవీ నరసింహా రావును దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు వరించింది.
PV Narsimha Rao Chaudary Charan Singh MS Swamynathan: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చాలా పకడ్బందీగా అడుగులు వేస్తోంది. విపక్షాల వైపు ప్రజల దృష్టి మళ్లకుండా.. తనదైన వ్యూహాలతో నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్డీయే సర్కార్. ఇప్పటికే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంతో ఎంతో కీర్తిప్రతిష్ఠలు సంపాదించిన మోదీ సర్కార్..
రైతు దూత.. దేశ ఐదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌ను భారతరత్నతో భారత ప్రభుత్వం గౌరవించింది. ప్రధాని మోదీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. జూలై 28, 1979 నుంచి జనవరి 14, 1980 మధ్యకాలంలో దేశ ప్రధానమంత్రిగా సేవలు అందించిన ఆయన జీవిత విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
భారతదేశ మాజీ ప్రధానులు పీవీ.నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రకటించారు.